అమెరికా టీచర్ సంచలన ట్వీట్...దెబ్బకి జాబ్ ఊడిపోయింది.

అమెరికాలో ఉన్న వలసదారులని తరిమి తరిమి కొట్టండి, వారిని అమెరికా నుంచీ వెళ్ళగొట్టాల్సిందే అంటూ ఓ టీచర్ అధ్యక్షుడు ట్రంప్ కి ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ కాస్తా ఆమె జాబ్ పోయేలా చేసింది.

వివరాలలోకి వెళ్తే.టెక్సాస్ లోని ఫోర్ట్ వోర్త్ ఇండిపెండెంట్ స్కూల్‌లో టీచర్ గా పని చేస్తున్న జార్జియా క్లార్క్ అనే మహిళ వలసదారులని అమెరికా నుంచీ తరిమేయండి అంటూ ట్రంప్ కి ట్వీట్ చేసింది.

తానూ పాటాలు చెప్తున్నా స్కూల్ లోనే ఎంతో మంది మెక్సికో, ఇతర దేశాలకు చెందిన వారు అక్రమంగా ఉంటున్నారని చట్టబద్దంగా వారు నివసించడం లేదని, వారి వల్ల డ్రగ్స్, సరఫరా సాగుతోందని ట్వీట్ చేసింది.దీనిపై దేశాధ్యక్షుడు వెంటనే స్పందించాలని పేర్కొంది.

దాంతో ఆమె పని చేస్తున్న స్కూల్ యాజమాన్యం షాక్ అయ్యింది.ఆమెని విధుల నుంచీ తొలగిస్తున్నట్టుగా పేర్కొంది.

Advertisement

అంతేకాదు ఆమెని తప్పించడానికి మిగతా టీచర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపారు.

ఈ విషయంపై ఆమెని వివరణ అడుగగా, ఈ ట్వీట్ లు బహిరంగంగా కనపడతాయనే విషయం తనకి తెలియదని సాకులు చెప్పింది.అయితే 2013లోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఈమె పలు విమర్సలకి గురయ్యింది.ఆమె గురించి విద్యార్ధులని ప్రశ్నించగా, అమెరికన్స్ తప్ప మాపై చాలా దురుసుగా ప్రవర్తిస్తుందని.

బాత్ రూమ్ కి వెళ్లాలని చెప్పినా సరే మీరు ఇక్కడ ఉంటున్నట్టుగా పత్రాలు చూపించి అప్పుడు వెళ్ళండి అంటోందని తెలిపారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు