ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ పార్టీ బ‌ల నిరూప‌ణ‌

ఢిల్లీ అసెంబ్లీలో మ‌రికాసేప‌ట్లో ఆప్ పార్టీ బ‌ల నిరూప‌ణ జ‌ర‌గ‌నుంది.సీఎం, ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో త‌మ బ‌లాన్ని నిరూపించుకోనున్నారు.

త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను బీజేపీ వేటాడ‌టానికి ప్ర‌య‌త్నించింద‌ని ఆయ‌న ఇటీవ‌ల ఆరోపించిన విష‌యం తెలిసిందే.ఈ క్ర‌మంలో సీఎం కేజ్రీవాల్ శాస‌న‌స‌భ‌లో విశ్వాస ప‌రీక్ష‌కు సిద్ధం అయ్యారు.

స‌భ‌లో మోష‌న్ ను ప్రవేశ పెట్టిన త‌ర్వాత‌, ఆప్ ప్ర‌భుత్వం త‌మ పార్టీ ఎమ్మెల్యేలు త‌మ‌తోనే ఉన్నార‌ని నిరూపించ‌డానికి ఈ బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు.అయితే, 70 మంది స‌భ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ కు 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈ క్ర‌మంలో విశ్వాస‌ప‌రీక్ష‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Advertisement
ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు