తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ప్రశ్నాపత్రాలు తారుమూరు కాకుండా, కాపీయింగ్ కు వీలు లేకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకోనుంది.ప్రశ్నపత్రం ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు హాల్ టికెట్ల నంబర్లు రాయాలని అధికారులు సూచించారు.

అదేవిధంగా కాపీయింగ్ కు పాల్పడితే డిబార్ తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.మరోవైపు ఇప్పటివరకు అమల్లో ఉన్న ఐదు నిమిషాల నిబంధనను ఎత్తివేసింది.

కాగా రేపు ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు