విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఫిషింగ్ హార్బర్ బోట్ల దగ్ధమైన కేసులో నిందితులను విడిచి పెట్టాలని వారి కుటుంబ సభ్యులు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ప్రమాదం చోటు చేసుకోవడంలో నాని, సత్యం ప్రమేయం లేకపోయినా పోలీసులు అరెస్ట్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.తప్పుడు సాక్ష్యాలతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైటాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!
Advertisement

తాజా వార్తలు