హైదరాబాద్ లో గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానించారంటూ ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు.దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Tension At Gandhi Bhavan In Hyderabad-హైదరాబాద్ లో గా�

ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం తోసుకుంటూ కాంగ్రెస్ నేతలు చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.రాహుల్ గాంధీని బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అవమానించారంటూ హస్తం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు