‘టెంపర్‌’ కలెక్షన్స్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, పూరిల కాంబినేషన్‌లో ‘టెంపర్‌’ సినిమాకు అనూహ్యంగా మొదటి ఆట నుండే మంచి స్పందన వచ్చింది.దాంతో మొదటి రోజు వసూళ్లలో రికార్డులు వచ్చాయి.

ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు లేక పోయినా కూడా ఈ స్థాయిలో వసూళ్లు రావడం ట్రేడ్‌ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపర్చుతోంది.మొదటి రోజు ఈ సినిమా 9.68 కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకుంది.టాలీవుడ్‌ మొదటి రోజు వసూళ్ల రికార్డుల్లో ‘టెంపర్‌’ మూడవ స్థానంలో నిలిచింది.మొదటి స్థానంలో పవన్‌ కళ్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’ 10.75 కోట్లతో ఉండగా, రెండవ స్థానంలో మహేష్‌బాబు ‘ఆగడు’ 9.74 కోట్లతో నిలిచింది.ఏరియాల వారిగా ‘టెంపర్‌’ కలెక్షన్స్‌ నైజాం : 2.9 కోట్లు సీడెడ్‌ : 2.1 కోట్లు గుంటూరు : 1.3 కోట్లు నెల్లూరు : 44 లక్షలు వైజాగ్‌ : 70 లక్షలు ఈస్ట్‌ : 85 లక్షలు వెస్ట్‌ : 73 లక్షలు కృష్ణ : 66 లక్షలు మొత్తం : 9.68 కోట్లు.

ఓకే టైటిల్ తో అక్కినేని, ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలు.. ఏది హిట్ ? ఏది ఫట్ ?

తాజా వార్తలు