సహాయం కావాలంటే మెసేజ్ చెయ్యండి... కానీ అలా మాత్రం చేయొద్దు ప్లీజ్....

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో వైద్యులు నిర్విరామంగా వైద్య సేవలను అందిస్తున్నారు.

దీంతో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు కరోనా విపత్కర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజలలో అవగాహన పెంచుతున్నారు.

కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి రేణు దేశాయ్ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి ఈ  కరోనా విపత్కర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తన అభిమానులకు తెలియజేసింది.అంతేకాకుండా నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో ప్రతి ఒక్కరూ అత్యవసర సమయంలో మాత్రమే బయటికి వెళ్లాలని అనవసరంగా బయటికి వెళ్లి ఇతరులను మరియు తన కుటుంబ సభ్యులను కరోనా వైరస్ బారిన పడేలా చేయొద్దని కోరింది.

అలాగే ఎవరికైనా ప్లాస్మా , రక్తం, భోజనం తదితర విషయాలలో సహాయం కావాలంటే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తనకు  మెసేజ్ చేయాలని తెలిపింది.అంతేగాక అనవసరమైన విషయాలను గురించి మెసేజ్ చేయొద్దని కూడా కోరింది.

అలాగే ఆర్థిక పరమైన సహాయం కూడా తనని అడగవద్దని తెలిపింది.గతంలో తాను ఆర్థికపరమైన సహాయం చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నానని కాబట్టి ఆర్థిక పరంగా తాను ఎలాంటి సహాయం చేయలేనని తెలిపింది.

Advertisement

అలాగే ప్రస్తుతం లాక్ డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లల్లో ఉంటారని దాంతో పక్షులు మరియు వీధి లో ఉన్నటువంటి కుక్కలు ఇతర జంతువులు ఆహారం లేక ఇబ్బంది పడతాయని కాబట్టి వాటికి కూడా అప్పుడప్పుడూ తగినంత ఆహారాన్ని ఇవ్వాలని కోరింది.అలాగే పనుల నిమిత్తమై బయటికి వెళ్లే సమయంలో మాస్కులను తప్పకుండా ధరించాలని, నిత్యం శానిటైజర్ తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని కూడా సూచించింది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు