ఒక్కోసారి కొంతమంది నటీనటులు అనుకోకుండా సినిమా పరిశ్రమకు వచ్చి ఒకట్రెండు హిట్ చిత్రాలలో నటించి ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమైన నటీనటులు చాలామందే చలన చిత్ర పరిశ్రమలో ఉన్నారు.
కాగా ఇందులో తెలుగులో టాలీవుడ్ ప్రముఖ హీరో నట కిరీటి "రాజేంద్ర ప్రసాద్" హీరోగా నటించిన "అందగాడు" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన దామిని కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే దామినిఅనుకోకుండా సినిమా పరిశ్రమకి వచ్చింది.కానీ వచ్చి రావడంతోనే 1999వ సంవత్సరంలో కన్నడ ప్రముఖ హీరో మరియు దర్శకుడు ఉపేంద్ర హీరోగా నటించిన "ఉపేంద్ర" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి సినిమా ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది.
ఆ తర్వాత అడపాదడపా చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ కొంత కాలం పాటు హీరోయిన్ గా బాగానే రాణించినప్పటికీ క్రమక్రమంగా సినిమా కథల పట్ల అవగాహన లోపించడంతో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినిమా కెరియర్ పై పడింది.
దీనికితోడు క్రమక్రమంగా దామిని డైట్ విషయంలో కూడా శ్రద్ధ లోపించడంతో బరువు బాగా పెరిగింది.దీంతో ఈ కారణం కూడా దామిని సినిమా ఇండస్ట్రీకి దూరమవ్వడానికి ఒక కారణం అయింది.
అయితే క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో దామిని పూర్తిగా సినిమా పరిశ్రమ దూరం అయింది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో దామిని సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు.దీంతో నటి దామిని ఎక్కడ ఉంది.? ఏం చేస్తుందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి దామిని తెలుగు, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 15కు పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఇందులో ఎక్కువ శాతం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.కాగా చివరగా నటి దామిని కన్నడలో "స్వతంత్ర పాల్య" అనే చిత్రంలో 2016వ సంవత్సరం లో నటించింది.
ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఈ అమ్మడికి సంబంధించిన ఎలాంటి సినీ సమాచారం లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy