ఒకప్పటి ఈ తెలుగు నటి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

తెలుగులో ఒకప్పుడు అక్క, చెల్లి, హీరోయిన్స్  స్నేహితురాలి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన  క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధురిమ సుందర్సన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే మధురిమ తెలుగులో ప్రముఖ దర్శకుడు ఆర్.

నారాయణ మూర్తి దర్శకత్వం వహించిన  "దళం" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి తెలుగు సినీ పరిశ్రమకు నటిగా పరిచయమైంది.ఆ తర్వాత సిమ్రాన్, సౌందర్య, మీనా, ఆమని, సంఘవి, తదితర హీరోయిన్ల చిత్రాలలో వారి స్నేహితురాలి పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే మధురిమ హైదరాబాదులో పిసి  సుదర్శన్ మరియు పిసి మంజుల దంపతులకు జన్మించింది. ఈమె కి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో పాఠశాలలో చదివే రోజుల్లోనే కల్చరల్ యాక్టివిటీస్ లో భాగానే పాల్గొనేది.

 ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా దళం చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుని నిరూపించుకుంది.ఇక మధురిమ వైవాహిక జీవితం విషయానికొస్తే ఆమె భర్త కూడా సినీ యాక్టర్.

Advertisement

 అతడు ఎవరో కాదు తెలుగులో వందకి పైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసినటువంటి నవీన్.కాగా  వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.అయితే నటన కి స్వస్తి చెప్పిన అనంతరం ఈ ఇద్దరు దంపతులు సినిమా పరిశ్రమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

 అంతే గాక వ్యాపార రంగంపై దృష్టి సారించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం మధురిమ తన కుటుంబ సభ్యులతో కలిసి జార్జియా దేశంలో నివాసముంటున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు