తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.  ఎన్ ఆర్.ఐ పై హత్య కేసు

ఓ భారతీయ అమెరికన్ విని తుపాకులతో దారుణంగా హతమార్చిన కేసులో నిందితులకు ఓహోయో కోర్టు గ్రాండ్ జ్యూరీ దోషులుగా తేల్చింది.

ఫిబ్రవరి తొమ్మిదో తేదీన జరిగిన ఈ హత్యాకాండలో విల్లీ జేమ్స్, అట్టావే (30), ల్యామండ్ జాన్సన్ (35) లను కోర్టు దోషులుగా తేల్చింది.వీరికి మరణ శిక్ష విధించే అవకాశం ఉంది.

2.తుఫాన్ లో చిక్కుకుని ఎన్.ఆర్.ఐ మృతి

అమెరికా తూర్పు తీరంలో విజృంభిస్తున్న ఇదా తుఫాను కారణంగా తెలుగు ఎన్.ఆర్.ఐ మృతి చెందారు.ఎడిషన్ నగరంలో నివసించే ధనుష్ రెడ్డి  (31) మృత దేహాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన సహాయ చర్యల్లో గుర్తించారు.

3.ఎన్.ఆర్.ఐ విద్యార్థుల ప్రతిభ

భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది.అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డులను సాధించారు.

ఈ విషయాన్ని యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకటించింది. రీ సైకిల్ మై బ్యాటరీ ప్రాజెక్ట్ కు గానూ శ్రీ నిహల్ తమన్నా కు పీఈ వై ఏ అవార్డు, వాటర్ ఎడ్యుకేషన్ అండ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కు హియా షా అనే విద్యార్థికి అవార్డులు దక్కాయి.

4.అబార్షన్ కోసం అమెరికా మహిళల పోరాటం

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అబార్షన్ ల పై బ్యాన్ విధించడంతో ఆ బ్యాన్ ను వెంటనే ఎత్తివేయాలని అక్కడి మహిళలు చాలా కాలంగా పోరాడుతున్నారు.దీనిపై అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.అయితే టెక్సాస్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం తో ఈ చట్టాన్ని ఎత్తివేయాలని మహిళలు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు.

5.తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుపై భారత్?

ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడిన ఖాళీ ప్రభుత్వం పూర్తిగా భారత్ తిరస్కరించాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని మాజీ భారత దౌత్యవేత్త అనిల్ వాద్రా అభిప్రాయపడ్డారు.

6.పాకిస్థాన్ చైనా రష్యాల కు తాలిబన్ల ఆహ్వానం

Advertisement

త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి పాకిస్థాన్ , చైనా, రష్యా, ఇరాన్ లను ఆహ్వానించారు.

7.ఉపగ్రహంలో నీటి జాడను గుర్తించిన శాస్త్రజ్ఞులు

గని మేడ్ ఉపగ్రహంలో లో నీటి జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు.మంచు పర్వతాల నుంచి 120 కిలోమీటర్ల మేర తవ్వితే మీరు బయట పడుతుందని వారు చెబుతున్నారు.

8.డీఆర్ కాంగో లో మిలిటెంట్ల దాడి 30 మంది మృతి

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో డైట్ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 30 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

9.తాలిబన్ల అదీనంలో పంజ్ షేర్

పంజ్ షేర్ తాలిబన్ల వశమైంది గవర్నర్ కార్యాలయం పై జెండా ఎగిరింది.ప్రావిన్స్ మొత్తం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్ళింది.

10.గినియాలో తిరుగుబాటు.

సైన్యం నిర్బంధంలో ఆ దేశ అధ్యక్షుడు

ఆఫ్రికా దేశాల్లో ఒకటైన గినియా దేశంలో తిరుగుబాటు మొదలయ్యింది.ఆ దేశ అధ్యక్షుడు ఆల్ఫా కొంటే ని గినియా దేశ సైన్యం నిర్బంధంలో కి తీసుకుంది.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు