తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారత్ బయోటెక్ వాక్సిన్ కు ఆస్ట్రేలియా అనుమతి

భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కొవాగ్జిన్ వేసుకున్న ప్రయాణికులకు తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది.

2.ఎఫ్ ఏటీఎఫ్ అనుమానిత లిస్ట్ లో టర్కీ

ఎఫ్ ఏటీఎఫ్ అనుమానిత దేశాల లిస్ట్ లో ఇప్పటి వరకు పాక్ ఉండగా, ఇప్పుడు టర్కీ కూడా చేరింది.అంతర్జాతీయ నిధులను కొన్ని దేశాలు ఉగ్రవాద చర్యల కోసం ఉపయోగిస్తుండడంతో అటువంటి దేశాలను ఈ లిస్ట్ లో చేర్చారు.

3.18 నెలల తరువాత ల్యాండ్ ఆస్ట్రేలియాలోకి విమానాలు

కరోనా నిబంధలు కారణంగా 18 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రస్తుతం తిరిగి ఆ సర్వీసులను పునరుద్దించడంతో అనేక అంతర్జాతీయ విమానాలు సిడ్నీలో ల్యాండ్ అయ్యాయి.

4.సూపర్ కంప్యూటర్ తయారుచేసిన చైనా

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్వంటమ్ సూపర్ కంప్యూటర్ ను చైనా సిద్ధం చేసింది.ఈ కంప్యూటర్ తయారీ విషయాన్ని డ్రాగన్ సీక్రెట్ గా ఉంచింది.

5.రైల్లో మంటలు పెట్టిన జోకర్

టోక్యోలో జోకర్ వేషధారణ లో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో భీబత్సం సృష్టించాడు.ఇతడు రైల్లో మంట పెట్టడమే కాకుండా కత్తితో దాడి చేసి 17 మందిని గాయపరిచాడు.

6.ఎలాన్ మాస్క్ సంచలన ప్రకటన

భూమ్మీద ఆకలి సమస్య పరిష్కరించేందుకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మంచి ప్రణాళికతో వస్తే 6 మిలియన్ డాలర్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు టెస్లా అధినేత ఎలెన్ మాస్క్ ప్రకటించారు.

7.పోప్ ప్రాన్సిస్ పై బైడన్ ప్రశంసలు

Advertisement

పోప్ ప్రాన్సిస్ పై గౌరవ ప్రదమైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రశంసించారు.

8.బ్రిటన్ లో రెండు రైళ్ల ఢీ

బ్రిటన్ దేశంలోని సాలిస్ బరీలోని పిషర్టన్ టన్నెల్ వద్ద రెండు రైళ్లు ఢీ కొన్నాయి.ఈ ఘటనలో రెండు రైళ్ల డ్రైవర్లకు గాయాలు అయ్యాయి.

9.వైట్ హౌస్ లో కరోనా కలవరం

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కరోనా కలవరం పుట్టిస్తోంది.వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి కి కరోనా సోకింది.

Advertisement

తాజా వార్తలు