తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారత అమెరికన్ కు కీలక పదవి

నెదర్లాండ్స్ లో అమెరికా రాయబారిగా భారతీయ అమెరికన్ రాజకీయ కార్యకర్త షెఫాలి రజ్దాన్ దుగ్గల్ ను ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రతిపాదించారు.

దానికి అమెరికా చట్టసభలో ఆమోదముద్ర లభించింది.  2.అమెరికాలో భారతీయ యువకుడు కాల్చివేత   అమెరికాలో క్రిస్ కొప్ ల్యాండ్ అనే దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో అమెరికాలో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన పరమ్ వీర్ సింగ్ అనే వ్యక్తి మృతి చెందాడు.మృతుడు అమెరికాలోని జార్జీయాలో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు.  3.ప్రవాసుల కు ఒమన్ కీలక సూచన

  రెసిడెన్సి వీసా కు సంబంధించి ఒమన్ పోలీసులు కీలక సూచన చేశారు.వీసా స్టాంపింగ్ విధానం పై కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు ప్రకటించింది.  4.క్వీన్ ఎలిజబెత్ కు నివాళి.చైనా కు నిషేదం

  బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పార్థీవ దేహానికి వెస్ట్ మినిస్టర్ హాల్ లో నివాళులు ఆర్పిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఎలిజిబిత్ కు నివాళులు అర్పించేందుకు చైనా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు.  5.చైనాలో భారీ అగ్నిప్రమాదం   చైనాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

హునాన్ ప్రవిన్స్ లోని చాంగ్ షా లోని టెలికాం బిల్డింగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.దాదాపు 200 మీటర్ల మేర మంటలు ఎగిసిపడడం తో డజన్ల సంఖ్యలో ప్లోర్ లు కాలిపోయాయి.  6.ఉక్రేయిన్ విద్యార్థుల కోసం కేంద్రానికి కీలక సూచన చేసిన సుప్రీం

  ఉక్రెయిన్ విద్యార్థుల కోసం కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.ఇతర దేశాల్లోని కళాశాలల్లో తమ చదువు కొనసాగించడానికి అవకాశం కల్పించేలా చూడాలని కేంద్రానికి సూచించింది.  7.భారత్ కు సహకరిస్తాం :చైనా అధ్యక్షుడు   వచ్చే ఏడాది షాంఘై సహకార సదస్సు కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ శుభాకాంక్షలు తెలిపారు.భారత్ నిర్వహించనున్న సదస్సు కు చైనా సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.  8.మాన్యుఫాక్చరింగ్ హబ్ దిశగా భారత్ పురోగతి

  మాన్యుఫాక్చరింగ్ హబ్ దిశగా భారత్ పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.ఇబ్బెకిస్తాన్ రాజధాని సామర్కండ్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ఆయన ప్రసంగించారు.  9.లిజియం లో 450 సమాధులు కనుగొన్నాం : జెలేన్ స్కీ   ఉక్రెన్ సైన్యం ఇటీవల చేజిక్కించుకున్న కీలక ప్రాంతం లిజీయం లో 450 సమాధులను కనుగొన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కి అన్నారు.  10.పుతిన్ మిత్రుడు ఆకస్మిక మృతి   రష్యా అధ్యక్షుడు వాగ్లిమర్ పుతిన్ కు అత్యంత ఇష్టమైన స్నేహితుడైన వాద్లిమర్ సుంగోర్కిన్ ఆకస్మికంగా గుండెపోటు తో మృతి చెందారు.         .

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు