తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.జర్మనీలో పడవ ప్రమాదం తెలుగు విద్యార్థి మృతి

  జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి కడారి అనిల్ (25 ) మృతి చెందాడు.

ఇతడు జర్మనీలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 

2.ఇండో అమెరికన్ కు అరుదైన గౌరవం

   అమెరికాలో ఇండో అమెరికన్ కు అరుదైన గౌరవం లభించింది.అమెరికన్  స్టాన్ ఫర్డ్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్ కు డీన్ గా భారత్ కు చెందిన అరుణ్ మజుందార్ నియమితులయ్యారు. 

3.నలుగురు భారతీయులకు పులిడ్జర్  అవార్డు

  నలుగురు భారత ఫోటో జర్నలిస్ట్ లకు పులిడ్జర్ అవార్డు దక్కింది.రాయిటర్స్ కు చెందిన దివంగత దానిష్ సిద్ధికి , అద్నాన్ అబిది, సన్నా ఇర్షద్ మట్టో , అమిత్ దావే 2022 అవార్డుకు ఎంపిక అయ్యారు. 

4.ఇజ్రాయిల్ కాల్పుల్లో రిపోర్టర్ మృతి

 ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో అవార్డులోని జెనిన్ పట్టణం లో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఆల్ జజిరా మహిళా రిపోర్టర్ షిరిన్ అబు అక్లే మృతి చెందారు. 

5.తీవ్ర అనారోగ్య సమస్యలతో చైనా అధ్యక్షుడు

  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సెర్రిబల్ అనూరికం తో ఆయన బాధ పడుతున్నారు. 

6.రష్యా కు థాంక్స్ చెప్పిన ఉక్రెయిన్

  తమ ప్రధాన శత్రువైన రష్యా కు ఉక్రెయిన్ థాంక్స్ చెప్పింది.రష్యా పొరపాటున తన సొంత సైన్యం పైనే కాల్పులు జరిపినట్టు వచ్చిన వార్తలపై ఈ విధంగా స్పందించింది. 

7.శ్రీలంక సంక్షోభం పై సుబ్రమణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు

Advertisement

  శ్రీలంక లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి స్పందించారు.శ్రీలంక లో చోటు చేసుకున్న సంక్షోభం పై వెంటనే భారత్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. 

8.బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్

  మైక్రో సాప్ట్ అధినేత బిల్ గేట్స్ కరోనా పాజిటివ్ కు గురయ్యారు.     .

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు