తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్- Telugu NRI America News

1.ఎన్.ఆర్.

ఐ లకు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం ఎన్.ఆర్.ఐ లకు గుడ్ న్యూస్ చెప్పింది.ఎన్.ఆర్.ఐ లు ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ విక్రయించే టూర్ ఆపరేటర్లు ఎన్.ఆర్.ఐ ల నుంచి పన్ను వసూలు చేయకూడదని ఆదేశించింది.ఐటీ చట్టం 206 సీ కింద చెల్లించాల్సిన పన్ను నుంచి ఎన్.ఆర్.ఐ లకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

2.నేషనల్ సిక్కు డే తీర్మానం ప్రవేశపెట్టిన భారతీయ అమెరికన్ సభ్యులు

  ఏప్రిల్ 14 ను  నేషనల్ సిక్కు డేగా నిర్వహించాలని కోరుతూ  భారతీయ అమెరికన్ సభ్యుడు రాజా కృష్ణ మూర్తి ప్రతినిధుల సభ లో తీర్మానం ప్రవేశపెట్టారు. 

3.ఉక్రెయిన్ లో 40 మంది భారతీయులు

  ఉక్రెయిన్ లో ఇంకా 40 మంది భారతీయులు చిక్కుకుపోయినట్టు రాజ్యసభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పారు. 

4.బెహ్రైన్ లో భారతీయుడికి అరుదైన గౌరవం

  బెహ్రైన్ లో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది.లులు ఫైనాన్షియల్ మేనేజింగ్ డైరెక్టర్ అధీబ్ అహ్మద్ కు బెహ్రైన్ కు గోల్డెన్ రెసిడెన్సీ వీసా తో  అక్కడి ప్రభుత్వం గౌరవించింది. 

5.రష్యా పై ఉక్రెయిన్ తొలి వైమానిక దాడి

  రష్యా పై ఉక్రెయిన్ తొలి వైమానిక దాడి నిర్వహించింది.రష్యా ఇంధన డిపో పై హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం కురిపించింది. 

6.ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు

Advertisement

  అమెరికా పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన విమర్శలు చేశారు.తాను రష్యా వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను కలిసిన తరువాత పాకిస్థాన్ పై అమెరికా కోపంగా ఉందని , తనను పదవి నుంచి ప్రశ్నించేందుకు కుట్రపన్నుతోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 

7.రష్యా దాడుల్లో 153 మంది పిల్లలు మృతి

  రష్యా దాడుల్లో ఉక్రెయిన్ లో 153 మంది పిల్లలు మృతి చెందినట్టు 245 మంది గాయాలపాలైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. 

8.భారత ప్రధాని రష్యా విదేశాంగ శాఖ మంత్రి భేటీ

  భారత ప్రధాని నరేంద్ర మోదీ తో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గి లావ్రోవ్ భేటీ అయ్యారు.ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. 

9.ఢిల్లీ చేరుకున్న నేపాల్ ప్రధాని

  నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు.

ఏప్రిల్ 1 నుంచి 3 తేదీ వరకు ఆయన పర్యటిస్తారు.     .

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు