తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ఇండో అమెరికన్ మహిళా

 

అమెరికాలోని చార్లొట్టే సిటీ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో ఇండో అమెరికన్ మహిళ డింపుల్ అజ్మీర విజయం సాధించారు.

 

2.విదేశీ యాత్రికల విషయమై సౌదీ కీలక ప్రకటన

 ఉమ్రా యాత్ర కు వచ్చే విదేశీ యాత్రికుల విషయంలో సౌదీ అరేబియా తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది.ఉమ్రా యాత్రకు వచ్చే ప్రయాణికులు సౌదీ అరేబియా లో ప్రవేశించేందుకు పీసీఆర్ పరీక్ష అవసరం లేదని , ఉ మ్రా , హజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

3.సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

 

విహార యాత్రకు భారతీయులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.సింగపూర్ ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది.పెద్దలు చెన్నై నుంచి సింగపూర్ కు ప్రస్తుతం పది విమానాలు నడుస్తుండగా వాటిని 17 కు పెంచారు. 

4.అమెరికా హెచ్చరిక

  ఆల్ ఖైదా చీఫ్ ఆల్ జవహరిని అగ్రరాజ్యం అమెరికా అంతమొందించిన నేపథ్యంలో అమెరికన్ల పై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికన్లు , ఆయా దేశాల్లో అమెరికన్ కార్యాలయాలు,  సానుభూతిపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఆ దేశం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

5.చీలి లో భారీ సింక్ హోల్ ను గుర్తించిన అధికారులు

 

చీలి లోని ఓ మైనింగ్ ప్రాంతంలో అధికారులు ఓ భారీ సింక్ హోల్ ను గుర్తించారు.ఈ సింక్ హోల్ చుట్టుకొలత 25 మీటర్లు ఉందని అధికారులు తెలిపారు. 

6.ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంభోజ్

 

Advertisement

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబొజ్ ఘనత సాధించారు. 

7.ఒబామా కీలక వ్యాఖ్యలు

 

డ్రోన్ దాడితో ఆల్ ఖైదా చీప్ ఆల్ జవహారిని అమెరికా మట్టుబెట్టిన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు.యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేయవచ్చు అనే దానికి జవహారి ఘటనే నిదర్శనమన్నారు. 

8.కూలిన పాక్ హెలికాప్టర్

  పాకిస్థాన్ లో హెలికాఫ్టర్ కూలిన ఘటనలో పాకిస్థాన్ ఆర్మీ జనరల్ సర్పరాజ్ ఆలీతో పాటు మరో ఆరుగురు మృతి చెందారు.         .

Advertisement

తాజా వార్తలు