తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో తీన్మార్ సంక్రాంతి వేడుకలు

 

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో 2022 జనవరి 15 న తీన్మార్ సంక్రాంతి 2022 సాంస్కృతిక ఉత్సవాలు కెనడా టొరంటో లో వర్చువల్ విధానం లో ఘనంగా జరిగాయి.

 

2.కోవాక్స్ ద్వారా పేద దేశాలకు వంద కోట్ల కరోనా టీకాలు

 ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన కోవాక్స్ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 144 పేద దేశాలకు వందకోట్ల టీకా డోసులు అందాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. 

3.అబుదాబి ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉగ్ర దాడి

 

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�

అబుదాబి ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉగ్ర దాడి జరిగింది.డ్రోన్ లతో ఈ దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. 

4.పాకిస్థాన్ ప్రధానిపై విమర్శలు

  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి తప్పిస్తే కానీ పాకిస్థాన్ కు మంచి రోజులు రావని ఆ దేశ జాతీయ పార్టీ జమాత్ - ఈ - ఇస్లామీ నేత సిరాజ్ ఉల్  హక్ వ్యాఖ్యానించారు. 

5.సముద్ర గర్భంలో సునామీ

 

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�

దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లో టోంగా దీవి లో భారీ విస్పోటనం సంభవించింది.దీని కారణంగా సునామీ ఏర్పడింది.భారీ అలలు ఉవ్వెత్తున ఎగిసిపదుతున్నాయి. 

6.ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం

 ఉత్తర కొరియా ఒకే నెలలో నాలుగోసారి సముద్రంలో రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించింది. 

7.అమెరికాలో మంచు తుఫాను బీభత్సం

 

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�
Advertisement

 ఆగ్నేయ అమెరికా ప్రాంతం లో బలమైన గాలుల తో కూడిన మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది.ఈ తుఫాన్తో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

8.ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని

 

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ రోజు ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక సంఘం సదస్సు లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రసంగించారు. 

9.దక్షిణాఫ్రికా వింత ప్రకటన

  కోవిడ్ 19 తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నామని, లాక్ డౌన్ కానీ, క్వారంటైన్ ఆంక్షలు విధించేందుకు కాని తాము సిద్ధంగా లేమని దక్షిణాఫ్రికా ప్రకటించింది.     .

Advertisement

తాజా వార్తలు