తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.అంతర్జాతీయ ప్రత్యేక తెలుగు సాహితీ కార్యక్రమం

 కెనడా తెలుగు సాహితీ సదస్సు - 12 అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రత్యేక తెలుగు భాష సాహిత్య సమావేశం ఈనెల 25 26 తేదీల్లో కెనడా రాజధాని ప్రధాన కేంద్రంగా ఈ వేడుకలు ఆన్లైన్ లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

2.ఆక్లాండ్ లో లాక్ డౌన్ ఆంక్షలు పొడిగింపు

  న్యూజిలాండ్ లోని అతిపెద్ద నగరం ఆక్లాండ్ లో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 21వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగించారు. 

3.కాబూల్ విమానాశ్రయంలో పాక్ విమానం ల్యాండింగ్

  తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కాబూల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తొలి అంతర్జాతీయ విమానం గా పాకిస్తాన్ రికార్డు సాధించింది. 

4.ఆఫ్ఘన మహిళల వినూత్న నిరసన

  నేను ధరించే దుస్తుల ఈ విషయంలో కలుగ చేసుకుంటే సహించేది లేదని మా దుస్తులే మంగళం అంటూ ఆఫ్ఘన్ మహిళలు నిరసన సరికొత్త రూపంలో వ్యక్తం చేస్తున్నారు. 

5.సరికొత్త క్షిపణి పరీక్షించిన ఉత్తర కొరియా

  చదువు లక్ష్యాన్ని ఛేదించే క్రూఈజ్ ను పరీక్షించినట్లు ఉత్తరకొరియా మీడియా తెలిపింది.సుమారు 1,500 కిలోమీటర్ల దూరం వరకు ఈ క్షిపణిని ప్రయాణించగలదు అని నార్త్ కొరియా మీడియా తెలిపింది. 

6.కోర్టుకు హాజరు కాలేకపోయిన అంగ్ సాన్ సూకీ

  మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీ ఈ రోజు కోర్టుకు హాజరు కాలేకపోయారు.ఆరోగ్య కారణాలతో ఆమె కోర్టుకు రాలేక పోయినట్లు ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

7.అమెరికాకు చైనా హెచ్చరిక

Advertisement

  అమెరికా పై సెప్టెంబర్ 11 నాటి దాడులు మళ్లీ జరిగే అవకాశాలు ఉన్నాయని చైనా హెచ్చరించింది. 

8.ఆఫ్ఘనిస్థాన్ లో కో-ఎడ్యుకేషన్ రద్దు

  ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ అధికారికంగా జెండా ఎగుర వేసిన మరుసటి రోజే తమను ఉన్నత విద్యా విధానాన్ని ప్రకటించింది.యూనివర్సిటీల్లో జెండర్ పరంగా వేరు వేరు తరగతులు నిర్వహిస్తారని కొత్త డ్రెస్ కోడ్ కూడా ప్రవేశపెట్టనున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. 

9.అడవి లో అత్యవసరంగా విమానం ల్యాండింగ్

  సాంకేతిక సమస్యతో ఓ విమానం అడవిలో అత్యవసరంగా ల్యాండ్ అయిన సంఘటన సెర్బియా లో జరిగింది.ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. 

10.చైనా లో లాక్ డౌన్

  పూజియాన్ ప్రావిన్స్ లోని పుతియాన్ నగరంలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఆ నగరంలో లాక్ డౌన్ విధించారు.

Advertisement

తాజా వార్తలు