తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.లభించిన భారతీయుల ఆచూకీ

 టర్కీ లో అదృశ్యమైన భారతీయుల ఆచూకీ లభించింది.

రెండు రోజుల్లో వారు ఇండియా కు చేరుకుంటారని గుజరాత్ పోలీసులు తెలిపారు.

 

2.యూఏఈ పై భారత రాయబారి కీలక వ్యాఖ్యలు

 

ప్రపంచంలోనే భారత ప్రవాసులకు అత్యంత సురక్షితమైన ప్రాంతం యూఏఈ అని ఆ దేశంలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ అన్నారు. 

3.అబుదబిలో తెలుగు ప్రవాసీకి ఘన సన్మానం

 

అబుదబిలో తెలుగు ప్రవాసి కి భారత రాయబార కార్యాలయం ఘన సన్మానం నిర్వహించింది.వరంగల్ కు చెందిన రాజ శ్రీనివాసరావు ను భారత రాయబారి సంజయ్ సుధీర్ సత్కరించింది. 

4.టోoగో లో భూకంపం

 

Advertisement

టోoగో లో భూకంపం సంభవించింది.దీని తీవ్రత 6.2 గా నమోదు అయ్యింది. 

5.రాజీనామా చేసే ప్రసక్తే లేదు : బ్రిటన్ ప్రధాని

 

తనపై ఎంతగా ఒత్తిడి చేసినా, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ వ్యాఖ్యానించారు. 

6.ఒమిక్రాన్ సోకితే డెల్టా వైరస్ సోకదు : ఐసీఏంఆర్

 ఒమిక్రాన్ సోకితే డెల్టా వైరస్ సోకదు అని భారత వైద్య పరిశోధన మండలి ( ఐసీఎంఆర్ ) ప్రకటించింది. 

7.అమెరికా లో పడవ ప్రమాదం .39 మంది గల్లంతు

 అమెరికా లోని ఫ్లోరిడా తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో 39 మంది గల్లంతయ్యారు. 

8.కరోనా ఉదృతి పై డబ్ల్యు హెచ్ వో ఆందోళన

 

కరోనా ఉదృతి రోజు రోజుకీ తీవ్రం అవుతుండడం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దబ్ల్యు హెచ్ వో ఆందోళన వ్యక్తం చేసింది.అమెరికా, ఫ్రాన్స్, భారత్, బ్రెజిల్, ఇటలీ దేశాల్లో ఈ కరోనా కేసులు ఉదృతం అవుతున్నాయి. 

9.ప్రవాస భారతీయుల డిమాండ్

  సీఏఏ ఆందోళనలో అరెస్టయిన 18 మంది విద్యార్థులను బేశరుతుగా విడుదల చేయాలని ప్రవాస భారతీయ ప్రముఖులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు