పోసాని పెద్ద అవకాశవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత...

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు మరియు నటుడు "పోసాని కృష్ణ మురళి" మరియు టాలీవుడ్ పవర్ స్టార్ "పవన్ కళ్యాణ్" మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఇటీవల పోసాని కృష్ణ మురళి పంజాబ్ రాష్ట్రానికి చెందిన టువంటి ఓ యువతి 17 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపయిందని చివరికి ఆమె గర్భవతి కావడంతో 5 కోట్ల రూపాయల డబ్బు ఇచ్చి అబార్షన్ చేయించారని వీలైతే ఆ హీరోయిన్ కి న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దీంతో కొందరు నెటిజన్లు పవన్ కళ్యాణ్ కి సంబంధం లేనటువంటి ఇష్యూ లోకి లాగడంతో పోసాని కృష్ణ మురళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఇటీవల ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో పోసాని కృష్ణ మురళి పై దాడి కూడా చేశారు.

దీంతో తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ సినీ నిర్మాత "నల్లం శ్రీనివాస్" ఈ విషయంపై స్పందించాడు.ఇందులోభాగంగా పోసాని కృష్ణమురళి 2010వ సంవత్సరంలో పోసాని "జెంటిల్ మ్యాన్" అనే చిత్రాన్ని తెరకెక్కించానని రాజావారి చేపల చెరువు మరియు పోసాని కృష్ణ మురళి హీరోగా నటించిన ఇతర చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్ట పోయానని చెప్పుకొచ్చాడు.

అనంతరం పోసాని కృష్ణ మురళి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ పోసాని కృష్ణమురళి పెద్ద అవకాశవాది అని మరియు మానసిక స్థితి సరిగా లేనటువంటి వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.అంతేకాకుండా అప్పట్లో పోసాని కృష్ణ మురళి మెగాస్టార్ చిరంజీవి దగ్గర మంచివాడిగా నటించడంతో తాను పోసాని "జెంటిల్ మ్యాన్" అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించానని కానీ తనని నిలువెత్తున మోసం చేశాడని చెప్పుకొచ్చాడు.

Advertisement
Telugu Movie Producer Nallam Srinivas Comments On Posani Krsihna Murali, Posani

అంతేకాకుండా పోసాని కృష్ణమురళి వంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీకి పట్టిన చీడ పురుగులని సంబోధించాడు.తమ అభిమాన నాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయడానికి పోసాని కృష్ణ మురళి కి ఎలాంటి అర్హత లేదని ఘాటుగా విమర్శించాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా మహిళలను గౌరవిస్తాడని ఇందులో భాగంగానే కర్నూలులో జరిగిన సుగాలి ప్రీతి ఘటన మరియు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆరేళ్ల చిన్నారి చైత్ర ఘటన వంటి వాటిపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తు చేశాడు.అలాంటి వ్యక్తిపై ఊరు, పేరు, వివరాలు తెలియచేయకుండా పంజాబీ హీరోయిన్ కి న్యాయం చేయాలంటూ సంబంధం లేనటువంటి విషయంలోకి లాగుతూ రాజకీయం చేస్తున్నారని ఇది సరికాదని హెచ్చరించాడు.

Telugu Movie Producer Nallam Srinivas Comments On Posani Krsihna Murali, Posani

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో నిర్మాత "నల్లం శ్రీనివాస్" పలు తెలుగు చిత్రాల్లో కి నిర్మాతగా వ్యవహరించాడు.కాగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కార్యకర్తగా పని చేస్తూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు