హరి డైరెక్షన్ లో తెలుగు హీరోలు...

ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం, శంకర్( Mani Ratnam, Shankar ) ల తర్వాత అంత మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఎవరు అంటే హరి పేరే చెప్పాలి.

ఈయన అప్పట్లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు.

ఈయన చేసిన సినిమాలు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగుతూ ఉంటాయి.మళ్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా హరి తన సినిమాలను ప్లాన్ చేసుకుంటాడు.

ఈయన విక్రమ్ తో చేసిన సామి అనే మూవీ తెలుగులో బాలకృష్ణ హీరోగా లక్ష్మీనరసింహ అనే పేరుతో రీమేక్ చేశాడు.ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తర్వాత హరి తన సినిమాలని తెలుగులోకి డబ్ చేయడం మొదలుపెట్టాడు.అందులో భాగంగానే సూర్య హీరోగా వచ్చిన ఆరు సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది.

Advertisement

ఈ సినిమాలో సాంగ్స్ అయితే అప్పట్లో తెలుగు లో సూపర్ హిట్ అయ్యాయి.

ఇక సూర్య హీరోగా ఈయన డైరెక్షన్ లో వచ్చిన సింగం సినిమా తెలుగులో యముడు అనే పేరుతో డబ్ అయింది.ఇక దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దీనికి సీక్వెల్ గా వచ్చిన సింగం 2, సింగం 3( Singham 2, Singham 3 ) సినిమాలు కూడా తెలుగులో వరుసగా రిలీజ్ అయ్యాయి ఈ సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి.ప్రస్తుతం హరి సినిమాలు ఎక్కువగా రావడం లేదనే చెప్పాలి.

అయితే ఒక మంచి స్క్రిప్ట్ తో హరి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.అయితే హరి తెలుగులో డైరెక్ట్ గా ఒక సినిమా చేయాలని కూడా చూస్తున్నాడు హీరోగా బాలకృష్ణ ని గానీ, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ ని గానీ పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
Advertisement

తాజా వార్తలు