మెగాస్టార్ చిరంజీవి అలా చేసినందుకు చాలా బాధపడ్డాను...

సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించే అవకాశాలు దక్కించుకొని ఆ తరువాత కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకొని అంతేగాక అంచలంచలుగా ఎదిగి నిర్మాతగా కూడా టాలీవుడ్ లో పలు చిత్రాలను నిర్మించిన ప్రముఖ కమెడియన్ మరియు సినీ నిర్మాత బండ్ల గణేష్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే బండ్ల గణేష్ నిర్మాతగా బాగానే రాణిస్తున్న సమయంలో రాజకీయాల్లో చేరి పలు అనివార్య కారణాల వల్ల మళ్ళీ తనకు రాజకీయాలు తగవంటూ వ్యాపారాలు మరియు సినిమా పరిశ్రమపై దృష్టి సారించాడు.

 తాజాగా బండ్ల గణేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినిమా రీ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలను వదిలి పెట్టి రాజకీయాల్లో చేరడం తనకు ఏమాత్రం నచ్చలేదని తెలిపాడు.

 అంతేగాక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాను ఎంతో బాధ పడ్డానని అలాగే ప్రతి రోజు మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లో నటించి ప్రేక్షకులని అలరించాలని ప్రతి రోజు దేవుడికి దండం పెట్టుకునే వాడినని కూడా తెలిపాడు.ఒక సామాన్య వ్యక్తిగా సినిమా పరిశ్రమకి వచ్చి సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా ఎదగడం అంటే సామాన్య విషయం కాదని అందువల్లనే మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో అభిమానమని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మెగా స్టార్ హోదా లో ఉన్నటువంటి చిరంజీవి గారు కొంతమంది రాజకీయ నాయకుల పక్కన నిల్చోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని అందుకే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని చాలా ఆత్రంగా ఎదురు చూసిన వారిలో నేను కూడా ఒక్కడని చెప్పుకొచ్చాడు.అలాగే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశం వచ్చినప్పటికీ రామ్ చరణ్ తేజ్ ఆ అవకాశాన్ని దక్కించుకోవడంతో తాను వదిలేశానని చెప్పాడు.

Advertisement

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బండ్ల గణేష్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో మళ్లీ గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కానుందని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు