తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్2, బుధవారం2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.05

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.8.30 ల9.44

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.కుటుంబ సభ్యులతో.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.చాలా కాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

బన్నీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయా.. న్యాయ నిపుణులు చెప్పిన విషయాలివే!
యూకేలో విషాదం .. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం

వ్యాపారమున నూతన లాభాలు అందుతాయి.నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

మిథునం:

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.

ఆర్థిక పురోగతి సాధిస్తారు.

కర్కాటకం:

ఈరోజు ఒక కీలక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టాలు ఎదుర్కొంటారు.పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.

ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడాలి.దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

సింహం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులు పని ఒత్తిడి నుండి బయటపడతారు.

కన్య:

ఈరోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు.ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన శిరోభాధలు తప్పవు.

వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

తుల:

ఈరోజు దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులుంటాయి.బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.

ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.

వృశ్చికం:

ఈరోజు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

ధనుస్సు:

ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

మకరం:

ఈరోజు ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

వృత్తి వ్యాపారాల్లో కష్టం వృధాగా మిగులుతుంది.రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

కుంభం:

ఈరోజు దూరప్రయాణ సూచనలు ఉన్నవి.బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మానసికంగా భాదిస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగవు.

ఉద్యోగస్తులకు అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

మీనం:

ఈరోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు.నూతన వాహన యోగం ఉన్నది.

వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలత కలుగుతుంది.బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు.

ధన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి.

తాజా వార్తలు