తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్9, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.42

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.51

రాహుకాలం: సా.4-ల.30 ల6.00

అమృత ఘడియలు: ఉ 9.30 ల10.00

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

సమాజంలో ఆదరణ పెరుగుతుంది.వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.

Advertisement

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

వృషభం:

ఈరోజు కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి.ధనపరంగా ఇబ్బందులుంటాయి.ఖర్చులు అదుపు చేయడం మంచిది.

పనులు నిదానంగా పూర్తవుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.

మిథునం:

ఈరోజు ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి.గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది.పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.

కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు కొత్త పనులు శ్రీకారం చుడతారు.దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సమాజంలో విలువ పెరుగుతుంది.విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి.

వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

సింహం:

ఈరోజు తండ్రి తరుపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి.

ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కన్య:

ఈరోజు వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు.చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి.నూతన రుణాలు చేయవలసి రావచ్చు.

కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి.వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తుల:

ఈరోజు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు.ఆర్థిక లాభాలు కలుగుతాయి.

ఆలోచనలు కలసి వస్తాయి.నూతన వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.ఋణ ప్రయత్నాలు కలిసిరావు.దూరపు బంధువులనుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది.

దూర ప్రయాణ సూచనలున్నవి.నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.

ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ధనుస్సు:

ఈరోజు రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలసి వస్తుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి.నూతన పెట్టుబడులు కలిసిరావు.

ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి.

మకరం:

ఈరోజు దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది.నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి.

శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడిల నుండి మంచి లాభాలను పొందుతారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

మీ ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

మీనం:

ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఇంటాబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి.

చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

తాజా వార్తలు