తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి10, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.29

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.26

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.7.26 ల8.15

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 10 Sunday 2024 , Daily Astr

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 10 Sunday 2024 , Daily Astr

ఈరోజు కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది.ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 10 Sunday 2024 , Daily Astr
Advertisement

ఈరోజు వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి.

ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం.ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు.

మిథునం:

ఈరోజు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.బంధు మిత్రుల నుండి నూతన విషయాలు సేకరిస్తా.వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది.వృత్తి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

సింహం:

ఈరోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది.

ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కన్య:

ఈరోజు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.గృహమున సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

తుల:

ఈరోజు కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకున్న పనులు అనుకున్న సమయంలో సకాలంలో పూర్తిచేస్తారు.వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.

వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.

వృశ్చికం:

ఈరోజు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

మొండి బాకీలు వసూలవుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

ధనుస్సు:

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులు వాయిదా పడుతాయి.బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.

వృత్తి, వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి.అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు.

మకరం:

ఈరోజు సన్నిహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి.

నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

దూర ప్రయాణ సూచనలున్నవి.

కుంభం:

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

ముఖ్యమైన వ్యవహారాలలో కొంత ఆశ్చర్య పరుస్తాయి.చాలకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మీనం:

ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.పాత రుణాలు కొన్ని తీర్చాగలుగుతారు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

తాజా వార్తలు