బిబి4 లీక్‌ : అమ్మ రాజశేఖర్‌ ఔట్‌

తెలుగు బిగ్‌ బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్స్‌ కు సంబంధించిన షూటింగ్‌ ను ప్రతి శనివారం నిర్వహిస్తూ ఉంటారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 మరో వీకెండ్‌ ఎపిసోడ్‌ నిన్న నేడు ప్రసారం కాబోతుంది.

ఎప్పటిలాగే నేటి ఎపిసోడ్‌ కూడా నిన్నే షూటింగ్‌ జరిగింది.ప్రతి శనివారం సాయంత్రం బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు అంటూ లీక్‌ వస్తుంది.

ఇక ఈ వారం లీక్‌ ను బట్టి అమ్మ రాజశేఖర్‌ ఎలిమినేట్‌ అవ్వబోతున్నాడు.కెప్టెన్‌ అయిన అమ్మ రాజశేఖర్‌ దుమ్ము దులుపుతూ ఇంటి సభ్యుల్లో కొందరిని ఒక ఆట ఆడిస్తున్నాడు.

ఇలాంటి సమయంలో ఆయన ఎలిమినేట్‌ అవ్వడంతో ఎ వర్గం వారు కాస్త రిలాక్స్‌ అయ్యారు.ఆయన ఎలిమినేషన్‌ పక్రియ నేడు చూపించబోతున్నారు.

Advertisement

ఇక వచ్చే వారం కెప్టెన్ ఎవరు లేకుండానే ఉండబోతుంది.హౌస్‌ లో కెప్టెన్‌ లేకున్నా కూడా అంతా సజావుగానే సాగుతుంది.

ఏదో టాస్క్‌ కోసం అన్నట్లుగా బిగ్‌బాస్‌ ఇంట కెప్టెన్సీ ని ఏర్పాటు చేస్తాడు.కొందరు కెప్టెన్‌ అయ్యాం అనగానే రెచ్చి పోతారు.

అమ్మరాజశేఖర్‌ కూడా కెప్టెన్‌ అయిన వెంటనే రెచ్చి పోయాడు.తనకు కోపం ఉన్న వారిని టార్గెట్‌ చేసి దుమ్ము దులిపేందుకు సిద్దం అయ్యాడు.

అభిజిత్‌ ఇంగ్లీష్‌ పదం మాట్లాడినందుకు గాను ఆయన్ను నిల్చోబెట్టాడు.ఇతరులు ఎవరు తప్పు చేసినా కూడా కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

జైల్లో కూడా పెట్టేందుకు కెప్టెన్‌ గా రాజశేఖర్‌ సిద్దం అయ్యాడు.మరీ ఈయన అరాచకం ఎక్కువ అయ్యిందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

ఈయన తీరుతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు.ఎప్పుడు ఎమోషనల్‌ అవ్వడం, ఎవరైనా ఏదైనా చెబితే వినక పోవడం వంటివి చేయడంతో ఈయన అంటేనే ప్రేక్షకులు మండి పడుతున్నారు.

ఇన్ని రోజులు అదృష్టం కొద్ది సేవ్‌ అవుతున్న అమ్మ రాజశేఖర్‌ ఈవారం బయటకు వచ్చేశాడు.గత వారం నోయల్‌ వెళ్లి పోవడం వల్ల అమ్మ సేవ్‌ అయిన విషయం తెల్సిందే.

తాజా వార్తలు