తన పార్ట్‌నర్ తో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న విష్ణు ప్రియ.... ఏకంగా...

తెలుగు బుల్లితెరపై తన గలగల మాటలతో  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న పొడుగు ముక్కు సుందరి విష్ణు ప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు మొదట్లో పలు చిత్రాలలో అడపాదడపా పాత్రలలో నటించి చివరికి సినిమా సినిమా అవకాశాలు లేకపోవడంతో యాంకరింగ్ వైపు వచ్చింది.

ఈ క్రమంలో తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన  ఈ టీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పోవే పోరా షో లో బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకర్ గా  వ్యవహరిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.దీంతో ప్రస్తుతం విష్ణు ప్రియ పలు రకాల షోలు, ఈవెంట్లతో బిజీబిజీగా గడుపుతోంది.

విష్ణు ప్రియ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన సమాచారాన్ని తన అభిమానులకి షేర్  చేస్తుంటుంది.అయితే గత కొద్ది కాలంగా షోలు, ఈవెంట్ల షూటింగుల్లో బిజీ కావడంతో తాజాగా రిలాక్స్ అవ్వడానికి గోవా వెళ్ళింది.

  దీంతో గోవా బీచ్ లలో బాగానే ఎంజాయ్ చేస్తోంది.ఈ క్రమంలో తెలుగు  బుల్లితెర రాములమ్మ శ్రీ ముఖితో కలిసి దిగినటువంటి ఫోటోలని విష్ణు ప్రియ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

Advertisement

 అంతేగాక ఈ ఫోటోలకు నా క్రైమ్ పార్ట్‌నర్ తో చాలా బాగా ఎంజాయ్ చేశానని, అలాగే  యాంకర్ శ్రీ ముఖి తనకు సోదరి లాంటిదని క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో శ్రీముఖి ఈ ఫోటోలపై స్పందిస్తూ "ఐ లవ్ యు" అలాగే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశామ్ అంటూ కామెంట్ చేసింది.

అయితే విష్ణు ప్రియ వీరిద్దరు ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొద్ది సమయంలోనే 60 వేల పై చిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.అయితే ఈ విషయం ఇలా ఉండగా హీరోయిన్ అవ్వాలని సినిమా పరిశ్రమకు వచ్చిన విష్ణు ప్రియ పలు అనివార్య కారణాల వల్ల హీరోయిన్ కాలేకపోయింది.

దీంతో ప్రస్తుతం ఒకపక్క పలురకాల షోలు ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క సినిమా హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.అంతేగాక అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ అందమైన ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.

ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. .

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు