Srileela, pranavi manukota, vaishnavi Chaitanya : తెలుగు హీరోయిన్స్ హవా పెరిగింది…ఎన్నాళ్ళో ఈ ముచ్చట

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో తెలుగు హీరోయిన్ల హవా తగ్గిపోయింది.

నాటి కాలంలో సావిత్రి, వాణిశ్రీ( Savitri, Vanishree ) వంటి వందల మంది హీరోయిన్స్ ఉన్న మన ఇండస్ట్రీ ముంబై హీరోయిన్స్ రాకతో పూర్తిగా తన వైభవాన్ని కోల్పోయింది.

తెలుగు ఇండస్ట్రీలో తెలుగుదనం కళ తప్పిన వేళ మళ్లీ తెలుగు హీరోయిన్స్ ఎప్పుడు వస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పైగా మా తెలుగు నటీమణులంతా కూడా పక్క భాషల్లో బిజీ అవుతున్నారు కానీ ఇక్కడ నిర్మాతలు దర్శకులు హీరోలు మాత్రం పక్క భాష వారి పైన ఆధారపడుతున్నారు.

అందుకు అనేక కారణాలు ఉన్నాయి.కొన్నిసార్లు సినిమాలో నటించిన కూర్చుంటున్న తెలుగు హీరోయిన్స్ హద్దులను మించి నటించకపోవడం డ్రెస్సింగ్ విషయంలో పరిమితులు పాటించడం వంటి కొన్ని కారణాలను సాకుగా చూపించి బాంబే ( Bombay )నుంచి హీరోయిన్స్ ని ఇంపోర్ట్ చేస్తున్నారు మన మేకర్స్.

అయితే ఇప్పుడు మళ్ళీ మన తెలుగు హీరోయిన్స్ కి కాలం కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో తెలుగు హీరోయిన్ల హవా కూడా పెరిగింది అయితే ఇది మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోతుందా లేక ముందు ముందు హీరోయిన్స్ కి కాలం కలిసి వస్తుందా అని అందరూ అనుకుంటున్నారు మరి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్న తెలుగు భామలు ఎవరో చూద్దాం.శ్రీ లీల( Sri Leela ) ప్రస్తుతం 10 కి పైగా సినిమాలను చేతిలో పెట్టుకుని నిర్మాతలను దర్శకులను తన ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్న నెంబర్ వన్ టాలీవుడ్ హీరోయిన్ గా శ్రిలీల సంపాదించుకుంది.

Advertisement
Srileela, Pranavi Manukota, Vaishnavi Chaitanya : తెలుగు హీర�

టాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్న ప్రతి ఐదు చిత్రంలో నాలుగు సినిమాలు శ్రీ లీల చేస్తుంది.ముందు ముందు ఈమె స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తుంది ఎలాంటి సందేహం లేదు.

Srileela, Pranavi Manukota, Vaishnavi Chaitanya : తెలుగు హీర�

వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చేసింది.ప్రస్తుతం అందరూ ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు.బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించగా వైష్ణవి కి మాత్రమే మంచి పేరు రావడం గమనించాల్సిన విషయం.

ఇక ముందు ముందు వైష్ణవి మరిన్ని సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

Srileela, Pranavi Manukota, Vaishnavi Chaitanya : తెలుగు హీర�

ప్రణవి మానుకొండ( Pranavi Manukonda ) చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రణవి అనేక సినిమాల్లో మరియు సీరియల్స్ ( serials )లో నటించింది ప్రస్తుతం యుక్త వయసు వచ్చి సోషల్ మీడియాలో పాపులర్ గా మారిన మారింది ప్రణవి.కమెడియన్ బ్రహ్మాజీ కొడుకు ను హీరోగా పెట్టి ఇస్లాం డాగ్ హస్బెండ్ అనే సినిమా తీస్తుండగా దాంట్లో హీరోయిన్గా ప్రణవి నటిస్తోంది ఈ సినిమా హిట్ అయితే ప్రణవి సైతం క్రేజ్ సంపాదించుకోవడం ఖాయం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు