Actress Jayalalithaa : పెళ్లి నరకం.. కొన్నిసార్లు లొంగిపోయాను.. తెలుగు నటి జయలలిత షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగులో సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా జయలలిత( Jayalalithaa ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ఒకప్పుడు బోల్డ్ రోల్స్ చేసిన జయలలిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఇండస్ట్రీలో నన్ను నేను రక్షించుకోవడానికి ఎలాంటి ప్లాన్ లు వేయలేదని ఆమె తెలిపారు.అందరితో కలివిడిగానే ఉండేదాన్నని జయలలిత చెప్పుకొచ్చారు.

కొన్నిసార్లు తప్పించుకునేదాన్నని కొన్నిసార్లు లొంగిపోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు.అలా అని ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పలేనని జయలలిత వెల్లడించారు.

అందంగా ఉండేదాన్నని వ్యాంప్ రోల్స్ చేసేదానినని ఆమె తెలిపారు.ఇండస్ట్రీలో తలుపులు కొట్టడం, అడగటం ఉండేవే అని జయలలిత పేర్కొన్నారు.

Advertisement

ఒక ఆర్టిస్ట్ రాత్రి సమయంలో తలుపు కొట్టి తలుపు తీయకపోతే ఉరి వేసుకుంటానని అన్నాడని ఆమె చెప్పుకొచ్చారు.మా తరంలో వ్యాంప్ అంటే వ్యాంప్ అని వేరే రోల్స్ ఇవ్వలేదని జయలలిత పేర్కొన్నారు.నేనెప్పుడూ అలాంటి వాటికి భయపడలేదని ఆమె తెలిపారు.

ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించలేదని ఆమె తెలిపారు.ఒకసారి పెళ్లి చెడిపోయాక ఇంకెవరితో ఉండాలని అనుకోలేదని జయలలిత కామెంట్లు చేశారు.

ఒక డైరెక్టర్( Director ) ను రిజెక్ట్ చేయడంతో పాత్ర కట్ చేశారని ఆమె వెల్లడించారు.చాలామంది నన్ను రెండో పెళ్లి చేశామనుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

ఒక పెళ్లి( Marriage )తోనే నరకం చూశానని జయలలిత అన్నారు.నేను శరత్ బాబుని ప్రేమించానని ఆయనతో కలిసుండాలని అనుకున్నానని ఆమె తెలిపారు.ఇప్పుడాయన లేరు కాబట్టి ఈ వివరాలు చెబుతున్నానని జయలలిత పేర్కొన్నారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

జయలలిత వెల్లడించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.శరత్ బాబు( Sarath Babu ) ఎంతో మంచి వ్యక్తి అని ఆయన నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని జయలలిత వెల్లడించారు.

Advertisement

ఇండస్ట్రీకి చెందిన వాళ్లే పెళ్లిని ఆపారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.మా మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదని జయలలిత చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు