తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి9, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.58

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.10.30 ల11.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 ల10.46 ల11.36

మేషం:

ఈరోజు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.కొన్ని విషయాలలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.బంధుమిత్రులు మీ మాటతో విబేదిస్తారు.

వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.నూతన ప్రయత్నాలు చేస్తారు.

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.

మిథునం:

ఈరోజు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం:

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.ఒక వ్యవహారంలో సన్నిహితులు సహాయ సహకారాలు అందుతాయి.

చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

సింహం:

ఈరోజు వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి.నూతన విషయాలపై దృష్టి సారిస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య:

ఈరోజు ఇతరుల పై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.

ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి.

సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు.

తుల:

ఈరోజు పితృ వర్గీయులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.చేపట్టిన పనులలో ప్రతిష్టంభన కలుగుతాయి.రెండు రకములైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు.

వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.బంధువులతో అకారణ వివాదాలు తప్పవు.

కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

ధనుస్సు:

ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.ముఖ్యమైన పనులు సమయానికి పూర్తిచేస్తారు.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఇంట బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

మకరం:

ఈరోజు దూరప్రయాణ సూచనలున్నవి.స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.

వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

నూతన ఋణప్రయత్నాలు కలసిరావు.చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు.

కుంభం:

ఈరోజు బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి.చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.

వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

ఈరోజు వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.

నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్నిస్తుంది.చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

తాజా వార్తలు