తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్31, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.48

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల11.00 మ2.00 సా 4.00

Advertisement
Telegu Daily Astrology Prediction Rasi Phalalu December 31 2023, Daily Astrology

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

మేషం:

Telegu Daily Astrology Prediction Rasi Phalalu December 31 2023, Daily Astrology

ఈరోజు మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.నూతన రుణ ప్రయత్నాలు కలసి రావు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

వృషభం:

ఈరోజు మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు.ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సంతాన వివాహ విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది.వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు.కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కొందరు ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు.నేత్ర సంబంధిత అనారోగ్యాలను కొంత బాధిస్తాయి

కర్కాటకం:

ఈరోజు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.సంఘంలో గౌరవం పెరుగుతుంది.సోదరుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

సింహం:

ఈరోజు వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి.స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో జాప్యం తప్పదు.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కన్య:

ఈరోజు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.

ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

తుల:

ఈరోజు సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి.రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆరోగ్యం మెరుగవుతుంది.

ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి.

వృశ్చికం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

సోదరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు.

ధనుస్సు:

ఈరోజు బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మకరం:

ఈరోజు ఇంటా బయట విలువ మరింత పెరుగుతుంది.సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.

వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

కుంభం:

ఈరోజు వృత్తి వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు.బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఒక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు.

నూతన వస్త్రా భరణాలను కొనుగోలు చేస్తారు.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.

మీనం:

ఈరోజు ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు.కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.దూరప్రాంత బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

తాజా వార్తలు