తెలంగాణా ఎంపీ లకు ఎమ్మెల్యే లకు పండగ

తాజా తెలంగాణా బడ్జెట్ లో ఎంపీలు.ఎమ్మెల్యేల ఇళ్ల కోసం రూ.

120 కోట్లు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని 17 మంది లోక్ సభ సభ్యులు.119 ఎమ్మెల్యేలకు వారి.వారి నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు.

పార్టీలకు అతీతంగా ఈ భవన నిర్మాణాలు జరుగుతాయని చెబుతున్నారు.ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.

రాజ్యసభ సభ్యులకు.ఎమ్మెల్సీలకు మాత్రం ఇళ్లను నిర్మించటం లేదు.

Advertisement

వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు ఫలానా అంటూ ప్రత్యేకంగా ఉండకపోవటంతో.వారిని ఈ దశలో మినహాయించినట్లు చెబుతున్నారు.

ఇక.ఎంపీలు.ఎమ్మెల్యేలకు నిర్మించి ఇచ్చే ఇళ్లు పక్కా వాస్తుతో ఉంటాయట.

వాస్తును విపరీతంగా నమ్మే కేసీఆర్.మరి.ఇళ్ల నిర్మాణంలో ఆ విషయానికి పెద్ద పీట వేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రెండు అంతస్తుల్లో నిర్మించే ఈ ఇళ్ల కోసం ఒక్కొక్క దానికి రూ.కోటికి పైనే ఖర్చు అవుతుందని తెలుస్తోంది.ఈ కొత్త ఇళ్లలో కింద ఎమ్మెల్యే కార్యాలయం.

పైన నివాసం ఉండేలా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.మొత్తం నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి ఈ నిర్మాణం పార్టీలకు అతీతంగా నేతల మనసుల్ని దోచుకోవటం ఖాయంగా చెబుతున్నారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!

ఏడాది వ్యవధి లోపలే ఎంపీలు.ఎమ్మెల్యేల బంగ్లాల నిర్మాణం పూర్తి చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

Advertisement

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇళ్లకు కొదవా? అందులోకి సంపన్న రాష్ట్ర సీఎం జోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.?

.

తాజా వార్తలు