తెలంగాణ అమరుల స్మారక స్థూపం ప్రారంభించిన సీఎం కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డులో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించడం జరిగింది.

గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించక ముందు మొదటిగా 12 తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్ నిర్వహించారు.

ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి.అమర జ్యోతిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

ఈ అమరవీరుల స్మారక కేంద్రంలో విశాలమైన సభా మందిరం, ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్, ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫోటో గ్యాలరీ.తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రంథాలయం మరియు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

మూడున్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తులో అమరుల స్మారకం ఏర్పాటు చేశారు.

Telangana Martyrs Memorial Stupa Inaugurated By Cm Kcr Telangana Governament, Cm
Advertisement
Telangana Martyrs Memorial Stupa Inaugurated By CM KCR Telangana Governament, CM

₹178 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్.తో .స్మారకాన్ని నిర్మించారు.2017లో అమరుల స్మారకానికి శంకుస్థాపన చేయటం జరిగింది.మూడు ఎకరాల ప్రాంగణంలో త్యాగాల దివ్య.150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం.కొలతలు కలిగిన ఈ అమర జ్యోతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది.100 సంవత్సరాలైనా తుప్పు పట్టని స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మాణం చేపట్టింది.బలమైన గాలులు తట్టుకునేలా కాటన్ స్టీల్ తో దీపం నిర్మించటం జరిగింది.

ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్ లెస్, స్టీమ్ లెస్ స్టీల్ భవనంగా రికార్డు సృష్టించింది.వంద టన్నుల స్టీల్, 1200 టన్నుల ఇనుముతో ఈ అమరవీరుల స్మారకం నిర్మాణం జరుపుకుంది.

Advertisement

తాజా వార్తలు