సోషల్‌ మీడియా ఎఫెక్ట్‌.... నానికి క్షమాపణలు చెప్పారు

తెలంగాణ థియేటర్స్‌ అసోషియేషన్ వారు నిన్న చేసిన వ్యాక్యలు తీవ్ర దుమారంను రేపాయి.

నాలుగు కోట్ల రూపాయల కోసం నాని తన సినిమాను అమెజాన్ వారి కోసం అమ్మేశాడు.

అది కూడా తిమ్మరుసు ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా నాని అబద్దాలు చెప్పి అమెజాన్ వారిని మోసం చేసి నాలుగు కోట్ల అదనపు రేటుకు తమ సినిమాను అమ్మేశాడు అంటూ థియేటర్ల సంఘం నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.నాని టక్ జగదీష్ సినిమాను ఓటీటీ విడుదల చేయడం ఆయన డబ్బు కాంక్ష అంటూ ఇంకా రకరకాలుగా విమర్శలు చేశాడు.

వారు చేసిన విమర్శలకు ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చాలా మంది నానికి మద్దతుగా నిలిచారు.

వారు నానిని విమర్శించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ టాలీవుడ్‌ తో పాటు సోషల్‌ మీడియాలో బలంగానే వాదన వినిపించింది.సోషల్‌ మీడియాలో వచ్చిన వ్యతిరేకత మరియు ఇండస్ట్రీ వర్గాల్లో చాలా మంది నానికి మద్దతుగా నిలవడం వంటి కారణాల నేపథ్యంలో వెంటనే థియేటర్ల యాజమాన్యాలు నేడు ప్రెస్‌ నోట్‌ ను విడుదల చేసి మరీ నానికి క్షమాపణ లు చెప్పడం జరిగింది.

Advertisement

నాని పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు నిలవడం వల్లే నేడు ఆయనకు క్షమాపణలు చెప్పారు.

సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇలా ఎప్పుడు కూడా ఒక తాటిపై ఉండాలి.నాని తప్పు లేకున్నా కూడా వారు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.టక్‌ జగదీష్ విషయంలో థియేటర్ల యాజమాన్యాలు కాస్త కోపంతో ఉన్నారు.

అది వాస్తవమే కాని నాని ఒక్కడే థియేటర్ల ద్వారా కాకుండా ఓటీటీ ద్వారా రావడం లేదు.చాలా మంది హీరోలు మరియు దర్శకులు తమ సినిమా లను ఓటీటీ కి ఇస్తున్నారు.

మరి నానిని ఎందుకు టార్గెట్‌ చేశారు అనేదానికి ఇదే సమాధానం.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు