వేటు పడింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుకున్నంత పని చేశాడు.డిప్యూటీ సీఎం రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను పక్కకు పెట్టేశాడు.

మూడు రోజులుగా పార్టీ సీనియర్‌ నేతలతో మరియు మంత్రులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు ఉదయం రాజయ్యను మంత్రి వర్గంలోంచి తీసేయాలని నిర్ణయించుకున్నాడు.రాజయ్య రాజీనామాను గవర్నర్‌ ఆమోదించడంతో వెంట వెంటనే అనూహ్య పరిణామాలు జరిగిపోయాయి.

రాజయ్య తప్పుకున్నట్లుగా రాజ్‌ భవన్‌ నుండి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే కడియం శ్రీహరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లుగా సీఎం ఆఫీస్‌ నుండి మీడియాకు సమాచారం అందింది.ఆ వెంటనే కడియం శ్రీహరితో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించడం కూడా జరిగింది.

కడియంకు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా అప్పగిస్తున్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫైల్‌ పై సంతకం చేశాడు.ఈ పరిణామాలు అన్ని కూడా వెంట వెంటనే చకచక జరిగిపోయాయి.

Advertisement

అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే సమయానికే అంతా అయిపోయింది.

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్
Advertisement

తాజా వార్తలు