ఆర్టీసీ పనైపోయింది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

గత కొద్దిరోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండగా.టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కార్మికుల సమ్మెను లెక్కచేయనట్లు వ్యవహారిస్తోంది.

సమ్మెకు దిగిన 50 వేల మంది కార్మికులను ఒక్కరోజులోనే తొలగిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారగా.ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ఆర్టీసీ కార్మికులు పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఇటీవల తెలంగాణ బంద్ నిర్వహించిన ఆర్టీసీ కార్మికులు.తమ డిిమాండ్లను నెరవేర్చేంతవరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు.

అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటివరకు మీడియా ముందు ఎక్కడా నేరుగా మాట్లాడని సీఎం కేసీఆర్.ఇవాళ తొలిసారి ఆర్టీసీ సమ్మెపై స్పందించారు.

Advertisement

ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితమని, ఇది చిల్లర యూనియన్ల రాజకీయ సమ్మె అని ఘాటుగా స్పందించారు.ఆర్టీసీ కార్మికులు అనవసరమైన పంథా ఎంచుకున్నారన్నారని విమర్శించారు.

  ఆర్టీసీని ఎవ్వరూ కాపాడలేరని, ఆర్టీసీ పనైపోయిందంటూ కేసీఆర్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమని, డబ్బులు ఇచ్చే సమయంలో సమ్మెకు వెళ్లారని చెప్పారు.తక్కువ ధరలకు నడిపేందుకు ప్రైవేట్ బస్సులు సిద్ధంగా ఉన్నాయని, ఆర్టీసీని స్వయంగా కార్మికులే ముంచుకున్నారని కేసీఆర్ ఆరోపించారు.

ప్రభుత్వాధినేతను అడ్డగొలుగా తిట్టి సమస్యలు పరిష్కరించుకుంగారా? అని ప్రశ్నించారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు