రైతు బంధు, రైతు సమన్వయ సమితి లు భేష్

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు బంధు, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్రం అభినందించినట్లు సీఎమ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో తెలంగాణ తరుఫున వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ పథకాలను కేంద్రం ప్రస్తావించిందని సీఎమ్ఓ పేర్కొంది.

రైతు బంధు, రైతు సమన్వయ సమితిలను ప్రత్యేకంగా అభినందించారని ప్రకటించారు.ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రానికి పలు సూచనలు చేసినట్లుగా వివరించారు.

వ్యవసాయ రంగంలో పెట్టబడులు పెట్టుబడిదారులకు వడ్డీభారం లేని రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.దీనివల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

Advertisement

వడ్డీని ప్రభుత్వమే భరించాలని తెలిపారు.తద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించగలుగుతామని అభిప్రాయపడ్డారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు