పార్లమెంట్ సమావేశాలకు సన్నాహాలు

దేశంలో కరోనా విజృంభిస్తోన్నా పార్లమెంట్ సమావేశాలు జరపాలని కేంద్రం నిర్ణయించుకుంది.వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 Parliament Sessions, Coronavirus, Parlaments Sessions, Sep 14 To Oct St, Speaker-TeluguStop.com

సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరపాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. భద్రత, సామాజిక దూరం వంటి చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

స్పీకర్ ఓం బిర్లా దీనిపై అనుసరించాల్సిన విధానాలను అధికారులతో చర్చించారు.మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన మార్గదర్శకాలపై వివిధ స్థాయిల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పార్లమెంట్ భవనం ఆవరణలో, లోపలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.సభ్యులు భౌతిక దూరం పాటించేలా సీట్లను సర్దుబాటు చేస్తన్నారు.రాజ్యసభ సమావేశాలకు ఛాంబర్లతో పాటు గ్యాలరీని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.60 మంది ఎంపీలు ఛాంబర్ లో, 51 మంది గ్యాలరీల్లో, మిగతా 132 మంది లోక్ సభ హాల్లో కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు.విపత్కర సమయంలోనూ పార్లమెంట్ సమావేశాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.అధికార ప్రతిపక్ష పార్టీల ఎంపీ లు కొందరు ఇప్పటికే కరోనా బారిన పడ్డ కారణంగా సమావేశాల విషయంలో కాస్త ఆందోళన నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube