తెలంగాణ బీజేపీ కి ఎన్ని ఇబ్బందులో ?

ఇప్పుడిప్పుడే తెలంగాణ బీజేపీ బలం పుంజుకుంటుంది అనుకుంటున్న సమయంలో పార్టీ నాయకుల్లో అప్పుడే భవిష్యత్తు పై బెంగ మొదలైనట్టుగా వ్యవహారాలు చేస్తున్నారు.మొదటి నుంచి బిజెపి లో ఉన్న వారితో పాటు,  ఇతర పార్టీల నుంచి చేరినవారు చాలామంది బిజెపిలో తమకు టికెట్ దక్కుతుందా లేదా ?  తమకు సరైన ప్రాధాన్యత ఇస్తారా లేదా ఇలా  అనేక సందేహాలతో సతమతం అవుతున్నారు.

కొంతమంది తమకు సరైన అవకాశం రాదని,  ఒక అంచనాకు వచ్చి పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారట.

మరోవైపు చూస్తే తెలంగాణలో తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని, బిజెపి రాష్ట్ర నాయకులు హడావుడి చేస్తున్నారు.      టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని,  రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామని , తమకు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో విజయం దక్కుతుందని రాష్ట్ర స్థాయి నాయకులు చెప్పుకొంటున్నారు.

అయితే వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలలో కొన్ని చోట్ల మినహా మిగతా చోట్ల బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు ? ఆ నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఎవరనేది స్పష్టంగా నిర్ధారించి లేని పరిస్థితి ఏర్పడింది.ఫలానా అభ్యర్థి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించేందుకు కూడా బీజేపీ అగ్రనేతలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.   

  చాలా మంది ఇతర పార్టీల నాయకులు టికెట్ హామీతోనే బిజెపిలోకి చేరారు.అయితే అలా చేరిన వారిలో చాలామందికి అభద్రతాభావం నెలకొనడం, తమకు టికెట్ ఇచ్చే చాన్స్ లేదని ఒక అంచనాకు రావడం ఇలా ఇలా ఎన్నో కారణాలతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట.దీనికితోడు కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కోవడం, నిత్యావసరాల ధరలు పెరుగుదల వంటి విషయాలపై ప్రజల్లో బీజేపీ పై తీవ్ర వ్యతిరేకత ఉండడం ఇవన్నీ తమకు ఇబ్బందికరంగా మారుతుంది అనే ఆలోచనతో చాలామంది కీలక నాయకులే ఉన్నారట.

Advertisement
సత్తిబాబు జగన్ నమ్మకాన్ని నిలబెడతారా  ? 
" autoplay>

తాజా వార్తలు