తెలంగాణా లాయర్లలో పెరుగుతున్న అసహనం

ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన దాదాపుగా ముగిసింది.అంటే ఉమ్మడి సంస్థలను విభజించడం చాలావరకు పూర్తి అయింది.

కొద్దిగా మిగిలి ఉన్నది కూడా తొందరలోనే పూర్తి అవుతుంది.ప్రధానమైన విభజన ఒకటి మిగిలి ఉంది.

అదే హై కోర్టు.దాని విభజనకు ఇప్పటివరకు ప్రక్రియ ప్రారంభం కాలేదు.

హై కోర్టును వెంటనే విభజించాలని తెలంగాణా నాయకులు, లాయర్లు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణా ఎంపీలు అదేపనిగా అడుగుతున్నారు.

Advertisement

కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.హై కోర్టు విభజన ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో తెలంగాణా లాయర్లు తరచుగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

వారు చాల అసహనంగా ఉన్నారు.హై కోర్టు విభజన జరగక పోవడంతో తెలంగాణా లాయర్లకు ఉద్యోగాలు రావడంలేదని, ప్రమోషన్లు రావడంలేదని ఆగ్రహిస్తున్నారు.

ఈ రోజు హై కోర్టు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.విభజనలో జాప్యం జరగడానికి ఆంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , కేంద్ర మంత్రి వెంకయ్య నాయడు కారకులని ఆరోపించారు.

కేంద్రం చొరవ తీసుకొని వెంటనే హై కోర్టును విభజిస్తే తెలంగాణా లాయర్లు ప్రశాంతంగా ఉంటారు.అలా చేయకపోతే తెలంగాణా ఉద్యమ సమయంలో మాదిరిగా విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉంది.

రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై చంద్రబాబు ఫోకస్
Advertisement

తాజా వార్తలు