కమిట్మెంట్ టీజర్... నలుగురు అమ్మాయిల జీవితాలు

ఈ మధ్యకాలంలో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మీటూ మాటున కాస్టింగ్ కౌచ్ కి సంబందించిన ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.

అవకాశాలు కావాలంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే అభిప్రాయం ప్రతి ఇండస్ట్రీలో ఉంది.

కమిట్మెంట్ అనేది చాలా సింపుల్ పదం క్రింద సినిమా ఇండస్ట్రీలో వాడుతారు.హీరోయిన్స్ తో మాట్లాడేటపుడు కమిట్మెంట్ ఉంటుందా అని డైరెక్ట్ గా అడిగేస్తారు.

అయితే కొంత మంది భామలు ఈ కమిట్మెంట్ కి అంగీకరిస్తారు.అయితే స్టార్ హీరోయిన్ అయినవాళ్ళు అందరూ కూడా కమిట్మెంట్ ఇచ్చారని కాదు.

కేవలం సినిమా రంగంలోకినే కాకుండా అన్ని రంగాలలో ఉద్యోగోన్నతి కావాలంటే సుపీరియర్స్ కి కమిట్మెంట్ ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది.ఈ కమిట్మెంట్ అనేది ఎంతో మంది అమ్మాయిల జీవితాలని మానసికంగా ఇబ్బందులకి గురి చేసింది.

Tejaswi Commitment Teaser Talk, Tollywood, Telugu Cinema, Digital Entertainment,
Advertisement
Tejaswi Commitment Teaser Talk, Tollywood, Telugu Cinema, Digital Entertainment,

ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో తేజస్వీ మదివాడతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ ప్రధాన పాత్రలలో కమిట్మెంట్ అనే సినిమా తెరకెక్కింది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది.దీనిని ఒటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కమిట్మెంట్ సినిమాకి సంబందించిన టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది.ఈ టీజర్ లో శృంగారాన్ని కాస్తా శృతి మించి చూపించారు.

అలాగే కమిట్మెంట్ అనేది నలుగురు అమ్మాయిల జీవితాలలో ఎలాంటి మానసిక సంఘర్షణకి గురి చేసింది అనే విషయం చూపించాబోతున్నట్లు విజువల్స్ బట్టి అర్ధమవుతుంది.మొత్తానికి ఒక బర్నింగ్ టాపిక్ ని తీసుకొని తెరపై అంతే హాట్ గా ఆవిష్కరించిన ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి.

జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు