మెట్రోలో సాంకేతిక లోపం

హైదరాబాద్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ అయిన హైదరాబాద్‌ మెట్రో రైలులో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తడం చాలా జనరల్‌గా జరుగుతూనే ఉంది.ఇప్పుడిప్పుడే జనాలు మెట్రోను ఆధరిస్తున్నారు.

మొదట్లో రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయంటూ మెట్రోకు దూరంగా ఉన్న జనాలు ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు తక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో మెట్రోను ఆశ్రయిస్తున్నారు.ఇలాంటి సమయంలో మెట్రో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందులకు ప్రయాణికులు గురయ్యారు.

అమీర్‌ పేట వద్ద మెట్రోరైలు విద్యుత్‌ ప్రసారం ఆగిపోవడంతో పెద్ద శబ్దం చేసి మెట్రో రైలు ఆగిపోయింది.వెంటనే అధికారులు స్పందించి సమస్య పరిష్కారంకు చకచక ఏర్పాట్లు చేశారు.

అయినా అప్పటికే చాలా మెట్రో రైల్లు రాకపోకలకు ఇబ్బంది కలిగింది.పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే ప్రథమం అని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామంటూ మెట్రో అధికారులు వెళ్లడించారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు