అతి త్వరలో పాకిస్తాన్ తో టీమిండియా సిరీస్..?!

టీమ్ ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే ఎన్నో భావోద్వేగాలు ప్రేక్షకుల్లో ఉత్పన్నమవుతుంటాయి.మైదానంలో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది.

ఇరు జట్ల ఆటగాళ్లు గెలవాలన్న కసితో చాలా సీరియస్ గా ఆడుకుంటారు.దీనివల్ల వీక్షించే ప్రేక్షకులకి కూడా ఇరు జట్ల మధ్య ఆట ఎంతో రసవత్తరంగా కనిపిస్తుంది.

పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ లను ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు చాలా ఆసక్తిగా వీక్షిస్తారంటే అతిశయోక్తి కాదు.ద్వైపాక్షిక సిరీస్ లో మన టీమ్ ఇండియా జట్టు పాకిస్తాన్ పై గెలిస్తే భారతీయ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటారు.

అయితే ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగక చాలా రోజులు అవుతోంది.కేవలం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్ మాత్రమే ఇండియా పాకిస్తాన్ తలపడుతున్నాయి.

Advertisement

ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్ లో ఈ రెండు జట్లు తలపడక చాలా రోజులు అవుతుంది.ఐతే తాజా సమాచారం ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్లు ఈ ఏడాదిలోనే ఒక ద్వైపాక్షిక సిరీస్ ఆడనున్నాయట.2021 ఏడాది ద్వితీయార్థంలో ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్‌ జరగవచ్చునని పాకిస్థాన్‌ కు చెందిన లోకల్ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వ ఉన్నత వర్గాలు 2021 లో భారత్‌ తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు రెడీ గా ఉండాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను ఆదేశించినట్లు పాకిస్తాన్ మీడియా కథనాలను ప్రచురించింది.

ఇకపోతే కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ ఎహ్‌సాన్ మణి మాట్లాడుతూ 2023 లో తమ దేశంలో జరగనున్న ఆసియా కప్ టోర్నమెంట్ లో భారతదేశం ఆడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఆఖరిసారిగా పాకిస్తాన్ జట్టు మన దేశంలో 2012-13 మధ్య కాలంలో పర్యటించింది.ఆ సమయంలో పాకిస్తాన్ జట్టు కేవలం పరిమిత ఓవర్ల సిరీస్ తో ఇండియాతో తలపడింది.2019లో ఇరు జట్లు వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో తలపడ్డాయి.

Advertisement

తాజా వార్తలు