సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడే టీమిండియా ప్లేయర్లు వీరే.. తెలుగు క్రికెట‌ర్‌కు కూడా దక్కిన చోటు!

కరోనా సమయంలోనూ దక్షిణాఫ్రికా పర్యటనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే త్వరలోనే సౌతాఫ్రికాకి భారత క్రికెట్ జట్టు బయల్దేరనుంది.

ఈ క్రమంలో టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎవరెవరు వెళ్లాలో నిర్ణయించి ఫైనల్ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ జట్టులో మొత్తం 18 మంది ఆటగాళ్లు ఉన్నారు.

అలాగే మరో నలుగురు స్టాండ్ బై ప్లేయర్లు కూడా ఉన్నారు.వీరంతా కూడా సౌతాఫ్రికాకి వెళ్లి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు.

అయితే ఊహించిన విధంగానే గాయాలపాలైన నలుగురు ప్లేయర్లను బీసీసీఐ ఈసారి సెలెక్ట్ చేయలేదు.రెస్ట్ తీసుకోవాలంటూ వారికి విశ్రాంతి కల్పించింది.

Advertisement

వారిలో రవీంద్ర జడేజా, శుభ్‌మన్‌ గిల్, అక్షర్ పటేల్, రాహుల్ దాహర్ ఉన్నారు.నలుగురు ఆల్ రౌండ్ ప్లేయర్లు ఈ టెస్ట్ సిరీస్ కు దూరం కావడంతో మన తెలుగు క్రికెటర్ అయిన హనుమ విహారికి జట్టులో చోటు దక్కింది.

ఇండియా-ఏ జట్టు తరఫున ఆడిన హనుమ విహారి గతంలో భారీ స్కోరు సాధించి దుమ్మురేపాడు.దాంతో ఈసారి దక్షిణ ఆఫ్రికా పర్యటనకు మళ్లీ హనుమ విహారిని ఎంచుకుంది బీసీసీఐ.

న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అతన్ని ఎంచుకోక పోవడంతో బీసీసీఐ సెలెక్టర్లను విమర్శించారు క్రికెట్ ప్రియులు.ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అతడికి స్థానం కల్పించారు.

ఇక ఎప్పటిలాగానే విరాట్ కోహ్లీ టెస్ట్ కు కెప్టెన్ గా కొనసాగనున్నారు.వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లకు మాత్రం రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్ సెంచరీలతో దుమ్ము రేపారు.దాంతో వీరిద్దరిని కూడా బీసీసీఐ జట్టులో చేర్చుకుంది.సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లే ఇండియన్ జట్టులోని ఆటగాళ్లందరి పేర్లు తెలుసుకుంటే.

Advertisement

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), రిషబ్​ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్.స్టాండ్ బై ప్లేయర్లు- నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, ఆర్జన్ నగ్వాస్‌వాలా.

తాజా వార్తలు