భారీ స్కోరు చేసిన టీమిండియా! ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 358!

మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు నమోదు చేసింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ శిఖర్ ధావన్ రాణించడంతో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినా కూడా ఇండియా ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా లో రోహిత్ శర్మ 95 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత మరో సారి రెచ్చిపోయి 143 పరుగులు చేశాడు.విరాట్ కోహ్లీ ని సింగిల్ డిజిట్ కే పరిమితం చేసిన ఆస్ట్రేలియా బౌలర్లకు ఆనందం ఎంతో సేపు నిలవలేదు.

రిషబ్ పంత్ శిఖర్ ధావన్ కు సాయం చేసి 36 పరుగులు చేయడంతో పాటు, చివర్లో వచ్చిన విజయ శంకర్ 26 పరుగులు చేయడంతో టీమిండియా 358 పరుగులు చేసి ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.ఈ మ్యాచ్లో గెలిచి 2-2 తో సమం చేయాలని భావించిన ఆస్ట్రేలియాకి ఇప్పుడు భారీ లక్ష్యం విజయాన్ని దూరం చేసేలా కనిపిస్తుంది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు