విద్యార్థిని చెవి కమ్మలు పోయాయని ఆ ఉపాధ్యాయుడు ఏంచేశాడంటే

ఎవరైనా చెవి కమ్మలు పొతే వెతుక్కుంటారు, దొరకక పొతే ఊరుకుంటారు.

కానీ ఒక స్కూల్ లో మాత్రం ఒక విద్యార్థిని చెవి కమ్మలు పోయాయన్న కారణంగా ఆ పాఠశాల ఉపాధ్యాయుడు క్షద్రపూజలు చేయించిన ఘటన చోటుచేసుకుంది.

ఈ దారుణ ఘటన ఏపీ లో చోటుచేసుకుంది.కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని సి.వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థిని చెవికమ్మలు పోయాయని ఉపాధ్యాయుడు రవి కుమార్ కు ఫిర్యాదు అందింది.దీంతో మంత్రగాడిని పిలిపించి అంజనం వేయిస్తే దొంగ దొరుకుతాడని, ఆదివారం తలస్నానం చేసి స్కూలుకు రావాలని విద్యార్థులకు చెప్పడం తో అందరూ తల స్నానం చేసి స్కూలుకు వెళ్లారు.

అప్పటికే అక్కడ మంత్రగాడు రమణతో ఉపాధ్యాయుడు రవికుమార్ సిద్ధంగా ఉన్నాడు.విద్యార్థుల చేతి గోళ్లపై పసరు రాసి మంత్రం పఠిస్తున్న సమయంలో ఓ విద్యార్థి తాత స్కూలుకు రావడం అక్కడ జరుగుతున్న తతంగం చూసి గట్టిగా ప్రశ్నించడం తో వారిద్దరూ కంగారుపడ్డారు.

విషయం తెలిసిన గ్రామస్థులు స్కూలుకు రావడంతో మంత్రగాడు రమణ అక్కడ్నుంచి పరారయ్యాడు.దీంతో ఉపాధ్యాయుడు నిర్వాకంపై ఆగ్రహించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్కూల్‌కు వచ్చిన పోలీసులు ఉపాధ్యాయుడును అదుపులోకి తీసుకున్నారు.

Teacher Kadapa District Ear Rings
Advertisement
Teacher Kadapa District Ear Rings-విద్యార్థిని చె�

తమకు ఏదో ఆకు పసరు పూశారని, ఆ తర్వాత తల తిరిగినట్టు అయిందని విద్యార్థులు తెలిపారు.బడిలో క్షుద్రపూజలపై స్పందించిన ఎంఈవో కూడా స్పందించారు.ఈ ఘటనపై విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.

మూఢనమ్మకాలను నమ్మవద్దని భావితరాలకు పాఠాలు నేర్పాల్సిన టీచర్ ఇలాంటి ఘటనకు పాల్పడటంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు