మాట మాట్లాడితే చాలు .చంద్రబాబు.
టీడీపీ టార్గెట్ గా వారు మాటల తూటాలు పేల్చుతుంటారు.అవినీతి ఆరోపణలు గుప్పిస్తారు.
కోర్టులలో కేసులు వేసి గుక్క తిప్పుకోకుండా చేస్తుంటారు.ఏదైనా కొత్త పధకం ప్రవేశపెడితే దానిలో లొసుగులు వెతుకుతారు.
ఇలా ఏదో ఒక వంకతో పార్టీని , ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న కొంతమంది వైసీపీ ఎమ్యెల్యేలు చంద్రబాబు ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారారు.వీరి కారణంగా ప్రభుత్వం పరువు పోవడమే కాకుండా మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అందుకే వారి తాట తీసి వారిని కేసుల్లో ఇరికించాలని ప్రభుత్వం ప్లాన్ వేసింది అందుకు తగ్గట్టుగానే వారిమీద కేసులు పెడుతూ వారి నోరు మూయించే పనిలోపడింది ప్రభుత్వం.

ప్రభుత్వాన్ని.ముఖ్యంగా చంద్రబాబు ని బాగా ఇబ్బంది పెడుతున్న వైసిపి ఎమ్యెల్యేల్లో మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నెల్లూరు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగిరి నుంచి రోజా, గుడివాడ నుండి కొడాలి నాని, నెల్లూరు రూరల్ నుండి అనిల్ కుమార్ యాదవ్, నరసరావుపేట నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.అందుకే వీరందరిని ప్రభుత్వం బాగా టార్గెట్ చేసింది.
ముందుగా శ్రీధర్ రెడ్డిని క్రికెట్ బుకింగ్ కేసులో ఇరికించారు.బుక్కీలతో సంబంధాలున్నాయని, క్రికెట్ బెట్టింగ్ లో కోటంరెడ్డి ఇన్వాల్వ్ అయ్యారంటూ కేసులు నమోదు చేశారు.
అలాగే.అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన డిఎస్పీ దుర్గాప్రసాద్ కు ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి భార్య బినామిగా ఉందంటూ ఏసిబి కేసులు పెడుతున్నారు.విచారణ పేరుతో గంటల పాటు అదుపులో ఉంచుకుంటున్నా.చంద్రబాబుపైనే కాకుండా ప్రభుత్వంపై ఆళ్ళ వివిధ కోర్టుల్లో సుమారు 35 కేసులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే.
కేసులతో చంద్రబాబును ఆళ్ళ ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఇక నగరి ఎమ్యెల్యే ఆర్కే రోజా గురించి అయితే చెప్పనక్కర్లేదు.
అసెంబ్లీ లోపలే కాకుండా బయట కూడా ప్రతీ రోజు చంద్రబాబు అండ్ కో బృందాన్ని రోజా ఉతికి ఆరేస్తోంది.రోజా ధాటిని తట్టుకోవటం టిడిపి వల్ల కావటం లేదు.
అందుకనే అసెంబ్లీ నుండి నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేసింది.తర్వాత మహిళా సదస్సుకు హాజరవ్వటానికి వచ్చిన రోజా విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే.
కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు దహనం కేసులో వైసిపి ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.విచారణ పేరుతో రోజుల తరబడి అదుపులో ఉంచుకున్నారు.
మరో ఇద్దరు ఎంఎల్ఏలు అనిల్ కుమార్, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కూడా టిడిపి టార్గెట్ చేసుకుంది.
వీరందరిని టార్గెట్ చేసుకోవడఫామ్ వెనుక ఇంకో కారణం కూడా ఉందని తెలుస్తోంది.
చంద్రబాబు చేయించిన సర్వేలో వీరంతా మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నట్టు తేలడంతో పాటు, ప్రజా సమస్యల విషయంలో వీరు పోరాడుతున్న తీరు ప్రజల్లోకి బాగా వెళ్లిందని, ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా వీరికి విపరీతమైన క్రేజ్ పెరిగినట్టు గుర్తించిన ప్రభుత్వం ఇలా వీరి హవా తగ్గించేందుకు కేసుల్లో ఇరికిస్తున్నట్టు స్పష్టంగా అర్ధం అయిపోతుంది.