తిరుపతిలో గెలుపెవరిది ? టీడీపీ సొంత సర్వే ?

సాధారణంగానే ఏ విషయమైనా తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సర్వేలను బాగా నమ్ముకుంటాయి.తాము ప్రకటించిన హామీలు కానీ, తమ నిర్ణయాలు కానీ ప్రజల్లోకి ఏమాత్రం వెళ్ళాయి ? ప్రజలు తమ గురించి , తమ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ?  తమ గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేక అంశాలతో రకరకాల సర్వేలు చేయించుకోవడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా వస్తుంది.

ప్రస్తుతం తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది.ఈ ఎన్నికలలో గెలుపు కోసం టిడిపి, వైసిపి ,బిజెపి పోటీ పడుతున్నాయి.2019 ఎన్నికలలో వచ్చిన ఫలితాలు తమకు ఇబ్బంది కరంగా , టిడిపి ఉనికి కోల్పోయే పరిస్థితి ఉండడంతో ఎలాగైనా గెలవాలని , ఆ పార్టీ కంకణం కట్టుకుంది.ఈ మేరకు తిరుపతి లోక్ సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉండబోతోంది అనే విషయంపై సర్వే చేయించినట్లు సమాచారం.  2019 లోక్ సభ ఎన్నికలలో తిరుపతి నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ కు 55.03 శాతం ఓటు షేర్ తో  7,22,877 ఓట్లు దక్కాయి ఇక టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మికి 37.65 శాతం ఓట్ షేర్ తో 4,94,501 ఓట్లు దక్కాయి.అయితే ఈ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మికి కేవలం రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపు ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలడంతో టిడిపి ఆందోళనలో ఉంది.

గత కొంతకాలంగా తిరుపతి ని టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తో పాటు టిడిపి నాయకులు అంతా చేస్తున్నారు.నియోజకవర్గాల వారీగా , మండలాల వారీగా నాయకులను ఇన్చార్జిలుగా నియమించి టిడిపి విజయం కోసం కృషి చేస్తున్నారు.

  అయితే అధికార పార్టీ కి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నట్లు సర్వేలో తేలిందట.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, టీడీపీలో నెలకొన్న పరిస్థితులు ఆ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చాయట.స్వయంగా టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ పరిస్థితి ఏమి బాగాలేదు అన్నట్లుగా ఓ సందర్భంలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇలా అనేక అంశాలు టిడిపికి ఇబ్బందికరంగా మారినట్లు గా కనిపిస్తోంది.

ఎలా చూసుకున్నా టిడిపికి ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచే విధంగా కనిపిస్తూ ఉండడం తో మరింత టెన్షన్ గా ఆ పార్టీ నాయకులు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

Advertisement

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

తాజా వార్తలు