టీడీపీలో వారసుల హావ ..వచ్చే ఎన్నికల్లో తెరపైకి కొత్త ముఖాలు

టీడీపీ లో వారసుల సందడి ఎక్కువాగా కనిపిస్తోంది.రాబోయే ఎన్నికల్లో చాలా చోట్ల కొత్త అభ్యర్థులు పోటీలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని పట్టుకుని ఉన్న నాయకులతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన కాకలుతీరిన రాజకీయ యోధుల్లో కొందరు వయోభారం కారణంగా .ఇక రాజకీయాలకు స్వస్తి పలికి తమ వారసులను రంగంలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు.ప్రస్తుతం షాడో సీఎం గా రాష్ట్ర వ్యవహారాలతో పాటు, పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్న లోకేష్ టీమ్ లో తమ వారసులను కలిపి రాజకీయంగా ఎదురు లేకుండా చేసుకోవాలనే ప్లాన్ లో సీనియర్లు ఉన్నారు.

చాలా కాలంగా పార్టీకి సేవలు అందించిన సీనియర్లు కొంతమంది పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటుంటే మరికొందరు మాత్రం తాము తప్పుకోకుండానే తమ వారసులకు కూడా టికెట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు.దీని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తో తరుచూ సంప్రదింపులు చేస్తూ తమ వారసుల సీట్లు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.రాబోయే ఎన్నికలు టీడీపీ కి చాలా క్లిష్టమైనవే కాకుండా చాలా ప్రతిష్టాత్మకం.

ప్రజల ఆలోచనా విధానం కూడా మారుతున్న తరుణంలో.కొత్త రక్తాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

అందుకే రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నారు.ఒకరిద్దరు కాదు.

ఈ జాబితాలో చాలా మంది నేతలుఉన్నారు.అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన రిటైర్మెంటును అనౌన్స్ చేశాడు.

వచ్చే ఎన్నికల్లో తన తనయుడు జేసీ పవన్ అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాడని జేసీ చెప్పేసాడు.అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడిని రంగంలోకి దించేందుకు చూస్తున్నాడు.

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం సీనియర్ డిప్యూటీ సీఎం కేఈ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుస్తోంది.ఆయన స్థానంలో తనయుడు కేఈ శ్యామ్ పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఇక చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల కూడా వచ్చేసారి పోటీ చేయడని తెలుస్తోంది.ఆయన స్థానంలో తనయుడు సుధీర్‌రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఫిరాయింపు ఎంపీగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్పీవై రెడ్డి కూడా వచ్చే సారి పోటీ చేయడం లేదు.ఆయన స్థానంలో ఆయన వారసుడిగా ఆయన అల్లుడు నంద్యాల ఎంపీగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాయలసీమ ప్రాంత నేతలు మాత్రమే కాదు.

మరికొంతమంది ఈ జాబితాలో నిలవనున్నారని తెలుస్తోంది.ఎంపీ మురళీమోహన్ వచ్చేసారి పోటీ చేసే అవకాశాలు లేవు.

ఆయన స్థానంలో ఆయన కోడలు మాగంటి రూపాదేవి రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.ఇక కోడెల కూడా వచ్చేసారి బరిలోకి దిగుతారా ? లేదా ? ఆయన తనయుడికి సీటు ఇస్తారా ? అన్నది చూడాలి.అయితే కోడెల ఫ్యామిలీకి ఒకే సీటు మాత్రమే ఇస్తానని బాబు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక సీనియర్ పార్లమెంటేరియన్, నరసారావుపేట ఎంపీ రాయపాటి రంగారావు తనయుడు రాయపాటి రంగారావు కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యే పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.వీరే కాకుండా ప్రతి జిల్లాలోనూ ఈ తరహాలోనే వారసులు రంగంలోకి దిగినందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

తాజా వార్తలు