కొత్త కాపురానికి వచ్చిన కోడలు...అత్తకి వాట్సాప్ లో ఏమని మెసేజ్ చేసిందో తెలుసా.? చూస్తే నవ్వాపుకోలేరు.!

అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మో.కోడల్లేని అత్త గుణవంతురాలు ఆహూ.

 Atha Kodalu Whatsapp Viral Messages-TeluguStop.com

ఆహూ…అని పాడుకోనివారుండరు.ఒకప్పుడు అత్త అంటే హడల్ మరి.ఇప్పటికీ ఆ సౌండ్లో ఏవో వైబ్రేషన్స్ ఉన్నట్టనిపిస్తాయి.మనకు అత్తంటే సూర్యకాంతమ్మే.

సినిమాల్లో ఆమె నటన చూసి భయపడినప్పటికీ,ఆమె నటనకి మురిసిపోయినవారూ ఉన్నారు.నిజజీవితంలో కూడా కోడళ్లని రాచిరంపాన పెట్టిన అత్తలున్నారు,అత్తలను సరిగ్గా చూసుకోని కోడళ్లు ఉన్నారనుకోండి.

అయితే రాను రాను పరిస్థితులు మారాయి.అత్తలు అమ్మస్థానాన్ని,కోడళ్లు కూతర్ల స్థానాన్ని తీసుకుంటున్నారు.

తమకు తెలియని వాటిని అత్తలనుండి అడిగి తెలుసుకుంటున్నారు.మోడ్రన్ కోడళ్లకు తగ్గట్టు అత్తలు అప్డేట్ అవుతున్నారు.

అయితే కోడల్ని అదుపులో పెట్టుకోవాలనుకుని ఒక అత్త పెట్టిన షరతులను ఒక కోడలు ఎలా తిప్పికొట్టిందో తెలుసా.ఇదే విషయానికి సంభందించిన ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చదువుకుంటే మాత్రం పక్కా నవ్వుకుంటారు… గడసరి కోడలు రాసిన ఉత్తరాన్ని ఒకసారి చదివేయండి

ప్రియమైన అత్తయ్య గారి పాద పద్మములకు ఆపాద మస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ,

మీ కొత్త కోడలు వ్రాయునది ఏమనగా

మీరు కాపురానికి వస్తున్నప్పుడు నాకు చెప్పిన అన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాను.కొత్తసంసారం పాలు పొంగినట్టు పొంగి పొర్లాలి అని చెప్పారు.

అందుకే రోజుకి రెండు లీటర్ల పాలు పొంగిస్తున్నాను.పొంగి పొర్లగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాం, కాకపోతే రెండు నెలలకే స్టవ్ కమురు కంపు కొట్టటం తో నిన్ననే కొత్త స్టవ్ కొనుక్కొచ్చాను.

పనీ, పాటా నేర్చుకోమన్నా మీ మాట మీద గౌరవం తో రోజుకి 5 గంటలు, ఏఆర్ రెహ్మాన్ పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తున్నాను.పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభం చేస్తాను.

మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా అందుకే, వారి ఆరోగ్యం దృష్ట్యా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను.భర్త ని కష్ట పెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నాను.చుట్టుపక్కల వారితో జాగ్రత్త అని చెప్పారు గా అత్తయ్యా అందుకే నిన్న ఎదిరింటావిడ పలకరించబోతే ముఖం మీదే తలుపులు వేసాను.ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీ లా మాడిమసిబొగ్గయింది.

పొదుపు చేయమన్న మీ మాట తో వారానికి ఒక్క డ్రస్ మాత్రమే కొనుకుంటున్నాను.అలాగే రెండు సినిమాలు మాత్రమే చూస్తున్నాం.

ఈ నెల పొదుపు చేసిన డబ్బు తో మీ అబ్బాయి కి కొత్త కర్చీఫ్ కొనిచ్చాను.

పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా అందుకే నిన్న వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను.

పాపం కాలు వేలు చిట్లి రక్తం వస్తే కట్టు కూడా కట్టాను.తొందర్లోనే తగ్గిపోతుంది లెండి.

మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే వివరంగా ఉత్తరం రాయగలరు…

ఇట్లు

మీ ప్రియమైన

కుమారుని పాద దాసి

మీ కోడలు

కోడలు రాక్…అత్తా షాక్…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube