బాలయ్య కూతురు రాజకీయాల్లో చక్రం తిప్పుతారా.. ప్రచారం నిజమైతే ఫ్యాన్స్ కు పండగే!

ఏంటి! బాలయ్య బాబు( Balayya Babu ) కూతురు రాజకీయాల్లో చక్రం తిప్పనుందా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి ( Nara Brahmani )గురుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రాజకీయాలు, వ్యాపారాలు బ్రాహ్మణికి కొత్తేమీ కాదు.ఈ రెండు రంగాల్లో ఈమె రాణించగలరు.

ఇప్పటికే హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ బాధ్యతల్లో ఉన్నారు.నాటికి నేటికీ హెరిటేజ్ ఈ స్థాయిలో ఉందంటే ఇందులో కీలక పాత్ర బ్రాహ్మణి దే.ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాణించాలని అది కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉత్సుకత చూపిస్తున్నారని తెలిసింది.

దీంతో టీడీపీలో( TDP ) కీలక బాధ్యతలు అప్పగించాలని అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ( Chandrababu, Nara Lokesh )ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇందుకు బాలయ్య కూడా ఒప్పుకున్నారట.కాగా నిన్న, మొన్నటి వరకూ ఒక లెక్క ఇప్పుడు టీడీపీ ఒక లెక్క.

Advertisement

ఎందుకంటె తెలంగాణలో ఉనికి కోల్పోయిన పార్టీని మళ్ళీ లేపాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.ఇక బీజేపీ( BJP ) అంటారా పర్లేదు సో చెప్పుకునేంత ప్రతిపక్షం అయితే లేదు.

పైగా ఈ రెండు పార్టీలతో పోలిస్తే టీడీపీ యాక్టివ్ అయితే భారీగానే చేరికలు ఉంటాయి.అందుకే ఇక పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బ్రాహ్మణి తన మనసులోని మాట బయట పెట్టడంతో తెలంగాణ బాధ్యతలను కట్టబెట్టాలని హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది.బ్రాహ్మణిని తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలిగా ప్రకటించాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.ఈ పదవి లేని పక్షంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని కూడా చర్చ ఐతే జరుగుతోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే టీడీపీ పెద్దల నుంచి ఇందుకు సంబంధించి కీలక ప్రకటన రానున్నది.అయినా బ్రాహ్మణికి రాజకీయాలు ఏమీ కొత్త కాదు.ఇప్పటికే తాను ఏంటో నిరూపించుకున్నారు.

చిగుళ్ల నుంచి తరచూ రక్తం వస్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
డంప్‌స్టర్ డైవింగ్ ద్వారా రూ.63 లక్షలు సంపాదించిన యూఎస్ మహిళ..?

మామ చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ కూడా జైలుకు వెళ్తారని టాక్ నడిచింది.నాడే బ్రాహ్మణికి పగ్గాలు వస్తాయని చర్చ జరిగింది.

Advertisement

కానీ లోకేష్ అరెస్ట్ ఆగడంతో అదేమీ జరగలేదు.ఐనా సరే నిజం గెలవాలి అని ఒకవైపు బాబు సతీమణి నారా భువనేశ్వరి మరోవైపు బ్రాహ్మణి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేశారు.

కీలక ప్రసంగాలు చేసి పంచ్ డైలాగులు కూడా పేల్చారు.నాడే ఈమె స్టామినా ఏంటో తెలుగు ప్రజానీకానికి తెలిసింది.

తాజా వార్తలు